POCSO అస్త్రంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు! భార్యలకు వార్నింగ్

వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి, వైవాహిక, వాణిజ్య వివాదాలలో క్రిమినల్ చట్టాన్ని ఒక 'వేధింపుల ఆయుధం’గా మార్చడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకోవడానికో లేదా ప్రత్యర్థులను లొంగదీసుకుని రాజీకి రప్పించడానికో చట్టాలను దుర్వినియోగం చేసే ధోరణి పెరిగిపోతోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మీరట్‌కు చెందిన ఒక కుటుంబానికి సంబంధించిన క్రిమినల్ ఫిర్యాదును కొట్టివేస్తూ, జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్వల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన 50 పేజీల మైలురాయి లాంటి తీర్పులో ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

కుటుంబ, వ్యాపార తగాదాల నేపథ్యంలో నిరాధారమైన ఆరోపణలు వచ్చినప్పుడు కింది కోర్టులు గుడ్డిగా వెళ్లకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ధర్మాసనం హెచ్చరించింది. లైంగిక వేధింపులు, మహిళలపై హింసకు సంబంధించిన నిజమైన కేసులను అత్యంత ప్రాధాన్యతతో, సీరియస్‌గా విచారించాల్సిందేనని స్పష్టం చేస్తూనే.. ప్రాథమిక ఆధారాలు, స్పష్టత లేని కల్పిత ఆరోపణలను ప్రారంభ దశలోనే తిరస్కరించాలని ఆదేశించింది. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా నడుస్తున్న పాత పగలను మనసులో పెట్టుకుని, భార్యాభర్తల పోరాటాల్లో అవతలి పక్షాన్ని లొంగదీసుకునేందుకు "ప్రలోభాల సాధనాలు"గా రేప్ (అత్యాచారం) నిబంధనలను ఆశ్రయిస్తున్నారని, అలాంటి వాటిపై కోర్టులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఉద్ఘాటించింది.

Supreme Court Warning Quashes Fake POCSO Case Warns Against Misuse Of Criminal Law In Matrimonial Rows

కూతుళ్లను అడ్డం పెట్టుకుని తండ్రులపై తప్పుడు 'పోక్సో’ కేసులు:

ఈ మధ్యకాలంలో వైవాహిక కలహాల్లో మైనర్ కుమార్తెలను అడ్డం పెట్టుకుని, తండ్రులపై తప్పుడు పోక్సో (POCSO) కేసులు బనాయించే ప్రమాదకర ధోరణి పెరిగిపోతోందని సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. "కుటుంబ సభ్యులు, పొరుగువారు, వ్యాపార భాగస్వాములు లేదా అప్పులు ఇచ్చిన-తీసుకున్న వ్యక్తుల మధ్య శత్రుత్వం ఉన్నప్పుడు.. నిందితులు తమ డిమాండ్లకు లొంగిపోయేలా చేయడానికి, సివిల్ వివాదాలను పరిష్కరించుకోవడానికి పిల్లల తల్లిదండ్రులు (ఎక్కువగా కుమార్తె తరఫున) పోక్సో చట్టాన్ని ఒక బ్లాక్‌మెయిలింగ్ సాధనంగా వాడుకుంటున్నారు" అని అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశాలలో సంచలన వ్యాఖ్యలు చేసింది. న్యాయవాదులు కూడా ఇటువంటి తప్పుడు, కల్పిత ఫిర్యాదులను ప్రోత్సహించకూడదని హితవు పలికింది.

రూ.800 లంచం కేసులో 20 ఏళ్ల తర్వాత తీర్పు..
రూ.800 లంచం కేసులో 20 ఏళ్ల తర్వాత తీర్పు..

భారతీయ సమాజంలో వివాహం ఒక పవిత్ర బంధం:

ఇదే సందర్భంలో భారతీయ సంస్కృతిలో వివాహ బంధానికి ఉన్న విశిష్టతను కోర్టు గుర్తుచేసింది. "మన సమాజం వివాహ వ్యవస్థను అత్యంత పవిత్రమైనదిగా, రెండు ఆత్మల ఉత్కృష్టమైన బంధంగా భావిస్తుంది" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమాజానికి మూలస్తంభం లాంటి కుటుంబ వ్యవస్థను, వైవాహిక పవిత్రతను ఇటువంటి అసంబద్ధమైన, ద్వేషపూరితమైన కల్పిత వ్యాజ్యాలు దెబ్బతీయకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని కోర్టు నొక్కి చెప్పింది.

అసలేం జరిగిందంటే..? (కేసు నేపథ్యం):

ఈ కేసు వివరాల ప్రకారం.. ఇషర్ చంద్ శర్మ, అతని కుటుంబ సభ్యులు (భర్త, అత్త, ఆడపడుచు, మరిది) తమపై మీరట్ కోర్టులో నమోదైన కేసును రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను 2025 సెప్టెంబర్ 15న అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. దీనిపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి ఈ దంపతులకు 2008లో వివాహమై, ఒక కుమార్తె, కుమారుడు జన్మించారు. అయితే మనస్పర్థల కారణంగా భార్య 2011లోనే ఇల్లు వదిలి వెళ్లగా, పిల్లలు తండ్రి వద్దే పెరుగుతున్నారు. ఆ తర్వాత వీరి మధ్య 2011 నుంచి 2024 వరకు FIRలు, విడాకుల కేసులు, క్రిమినల్ రివిజన్లతో ఒక సుదీర్ఘ న్యాయపోరాటమే నడిచింది.

చివరకు 2024 సెప్టెంబర్‌లో భార్య మీరట్ పోక్సో కోర్టులో తీవ్రమైన ప్రైవేట్ ఫిర్యాదు చేసింది. భర్త తన 14 ఏళ్ల కుమార్తెను అశ్లీల వీడియోలు చూడమని బలవంతం చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడని, మరిది కూడా తనపై అత్యాచారం చేశాడని, అత్తా ఆడపడుచులు సుత్తితో కొట్టారని ఆరోపించింది.

సుప్రీంకోర్టు తీవ్ర సందేహాలు.. కేసు రద్దు!

ఈ ఆరోపణల క్రమం, సమయాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు తీవ్ర సందేహాలను వ్యక్తం చేసింది. కుమార్తె మే నెలలోనే తల్లి వద్దకు రాగా, ఫిర్యాదు మాత్రం సెప్టెంబర్‌లో ఎందుకు చేశారని ప్రశ్నించింది. పైగా, బాధితుల వాంగ్మూలాలు 'చిలుక పలుకుల వలె’, 'యథాతథంగా ఒకేలా’ ఉండటం చూస్తే ఎవరో తర్ఫీదు (ట్రైనింగ్) ఇచ్చి చెప్పించినట్లు స్పష్టమవుతోందని ధర్మాసనం తప్పుపట్టింది. అత్యాచార ఆరోపణలకు గానీ, గాయపరిచారనే వాదనలకు గానీ ఎలాంటి వైద్య పరీక్షల నివేదికలు (Medical Evidence) లేకపోవడం ప్రాసిక్యూషన్ కథనానికే ప్రాణాంతకంగా మారిందని కోర్టు తేల్చేసింది.

సె*క్స్ వర్కర్ల జీవితాలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు!
సె*క్స్ వర్కర్ల జీవితాలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు!

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రసిద్ధ 'భజన్ లాల్’, 'దారా లక్ష్మీ నారాయణ’ తీర్పులను ఉటంకిస్తూ.. ఈ కేసులోని ఆరోపణలు కేవలం దురుద్దేశపూర్వకమైనవని స్పష్టం చేసింది. దీంతో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన పాత ఉత్తర్వులను పక్కన పెడుతూ.. నిందితులపై ఉన్న పోక్సో, బీఎన్‌ఎస్ (BNS) ఫిర్యాదులను, సమ్మానింగ్ ఉత్తర్వులను సుప్రీంకోర్టు పూర్తిగా రద్దు చేసింది. అయితే, ఈ పరిశీలనలు కేవలం ఈ కేసుకు మాత్రమే వర్తిస్తాయని, మిగిలిన విడాకుల కేసులపై దీని ప్రభావం ఉండదని, వాటి మెరిట్స్ ఆధారంగానే అవి తేలాలని కోర్టు స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+