విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతోంది..!?
విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. కేంద్రం ప్రకటించిన ఆర్దిక ప్యాకేజీ తో కొంత మేర ప్లాంట్ తిరిగి నిలబడుతుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. కేంద్రం సైతం ఈ మధ్య కాలంలో ప్లాంట్ భవిష్యత్ కు అనుగుణంగా సానుకూల సంకేతాలు అందిస్తోంది. ఉత్పత్తి సైతం పెరిగింది. కార్మికులు సైతం లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తున్నారు. కాగా, ఈ సమయంలోనే యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాల పైన కొత్త చర్చ మొదలైంది.
విశాఖ ఉక్కు కర్మాగారంలో గుట్టుచప్పుడు కాకుండా టోటల్ ఆపరేషన్ మెయింటినెన్స్ కాంట్రాక్టు (టిఒఎంసి) సిస్టమ్‌ను ఉక్కు యాజమాన్యం వేగవంతం చేస్తుందనే వాదన వినిపిస్తోంది. కేంద్రం లోని మోడీ సర్కారు డైరెక్షన్‌లో సదరు చర్యలతో పరోక్షంగా ఉక్కు పరిశ్రమలోని వివిధ విభాగాలపై ఇప్పటికే దాడికి దిగింది. ఈ టిఒఎంసి ద్వారా బడా కాంట్రాక్టు సంస్థలకు పలు విభాగాలు ధారాదత్తం అవుతాయి. అంతేగాక కొత్తగా రిక్రూట్‌మెంట్‌కు ఆస్కారం ఉండదు. పర్మినెంట్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించేందుకు ఆ కాంట్రాక్టు టెండరులో ఓ అంశాన్ని పేర్కొనడంతో కార్మికులు తీవ్ర స్థాయిలో ఆవేదనకు గురవుతున్నారు. ఇంకా ఏన్నాళ్లు ఏ హక్కులూ లేకుండా పనిచేయాలని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలోని టిడిపి కూటమి సర్కారుకు ఇవేమీ పట్టడం లేదు. గతంలో ప్లాంట్‌లో టిఎంసి (టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టు) విధానం ఉండేది. తాజాగా బడా కంపెనీలను రంగంలోకి దించుతున్నారు.

తాజా నిర్ణయాలతో కొత్త చర్చ
కాగా, దీనికి సంబంధించి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఇఒఐ)లను పిలవడంతో ప్లాంట్‌లోని సింటర్ ప్లాంట్‌ను టాటా సంస్థ ఇప్పటికే దక్కించుకుంది. ఇంకా అనేక సంస్థల జాబితాను యాజమాన్యం ప్రకటించడం లేదు. ఇప్పటికే కోక్ ఒవెన్, ఆర్‌ఎంహెచ్‌పి, పవర్ ప్లాంట్, సింటర్ ప్లాంట్, బ్లాస్ట్ ఫర్నేస్‌లలో సరైన మెయింటినెన్స్ లేదు. రస్ట్ క్లియరెన్స్ లేక ఉత్పత్తిపైనా, ప్లాంట్ విభాగాల సామర్థ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. నేటికీ కార్మికుల జీతాలకు సంబంధించి రూ.రూ.860 కోట్ల బకాయిలు ఉన్నాయి. ప్రస్తుతం అమలు చేసేందుకు సిద్ధమవుతున్న టిఒఎంసితో ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులను కొనసాగించడానికి వీలు పడదు. ఆ విధంగా టెండరులోనే పేర్కొన్నారు. గత టిఎంసి కాంట్రాక్టు సిస్టంలో యూనియన్‌లు సాధించిన హక్కు ప్రకారం పర్మినెంట్ కార్మికుల్లో 50 శాతం, నిర్వాసితుల నుంచి 50 శాతం ర్రికూట్‌మెంట్‌లో స్థానం ఉండేది. తాజా టెండర్లతో వీటిని ఉక్కు యాజమాన్యం రద్దుచేసింది. ఈ పరిస్థితుల్లో ఒఎంసి విధానమొస్తే పరిశ్రమలో ఆపరేషన్స్ అన్నీ బడా కాంట్రాక్టు సంస్థల చేతిలోకి వెళ్లిపోతయానే ఆందోళన కార్మికుల్లో వ్యక్తం అవుతోంది.













Click it and Unblock the Notifications