తాజా పరిణామాల వేళ తెలంగాణ కేంద్రంగా పవన్ కీలక నిర్ణయం..!!
జనసేనాని పవన్ రూటు మార్చారు. తెలంగాణలో కొద్ది రోజులుగా పవన్ కేంద్రంగా కీలక పరిణామా లు చోటు చేసుకుంటున్నాయి. పవన్ సైతం ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల పైన స్పందించారు. ఆ తరువాత ఆయన పైన కేసులు వద్దని సూచించినట్లు వెల్లడించారు. కొందరు నాగేశ్వర్ కు మద్దతు గా పవన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సమయంలోనే పవన్ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినో త్సవం వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో పార్టీ బలోపేతంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో పార్టీని మరింత విస్తరించేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ జనసేన కీలక నేతలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకం గా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ, ప్రజల్లో పార్టీని మరింతగా తీసుకెళ్లే మార్గాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దృష్టి తెలంగాణపై మరింతగా కేంద్రీకృతమైంది. యువత, మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగార్థుల్లో జనసేనకు పెరుగుతున్న ఆదరణను పార్టీ బలంగా మార్చే దిశగా కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది.

గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు
త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో పార్టీ స్థాయిని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలను కూడా లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి నుంచే బూత్ స్థాయి బలపరిచే పనులపై పవన్ నాయకత్వం దృష్టి పెట్టింది. హైదరాబాద్ లో జరిగే ఎన్నికల్లో జనసేన బలం పెంచుకుంటూ... స్థానాలను సొంతం చేసుకునే విధంగా పవన్ దిశా నిర్ధేశం చేసే అవకాశం కనిపిస్తోంది. ఏపీలోని స్థిరమైన రాజకీయ శక్తిగా ఎదిగిన తర్వాత, ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో.. ఈ భేటీలో పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు... ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications