AP Pensions: ఏపీలో జూన్ నెల పెన్షన్లపై కీలక అప్డేట్..! కొత్తగా వీరికే..!
ఏపీలో జూన్ నెల పెన్షన్ల (pensions) పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. గత నెలతో పోలిస్తే పెన్షన్ల లబ్దిదారుల సంఖ్యను పెంచి ఇవ్వబోతోంది. కొత్తగా వితంతు పెన్షన్లను ఇందులో చేర్చింది. దీంతో లబ్దిదారుల సంఖ్య కూడా పెరిగింది. జూన్ 1న పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించిన నిధుల్ని ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. వీటిని సచివాలయ ఉద్యోగులు జూన్ 1న లబ్దిదారులకు పంపిణీ చేయబోతున్నారు.
జూన్ నెలలో 'ఎన్టీఆర్ భరోసా' పథకం కింద పింఛన్ల పంపిణీ కోసం మొత్తం రూ.2,728 కోట్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ఈ నిధులు సచివాలయాల ఖాతాల్లోకి పంపారు. వీటిని ఉద్యోగులు డ్రా చేసి జూన్ 1న లబ్దిదారులకు అందించాల్సి ఉంటుంది. అలాగే ఈసారి మొత్తం ఏపీ వ్యాప్తంగా 62,34,445 మందికి ఎన్టీఆర్ భరోసా పించన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కొత్తగా 5,606 మందికి స్పౌజ్ పింఛన్లు ఇవ్వబోతున్నారు. వీరి కోసం రూ.2.24 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.

పెన్షన్ల లబ్దిదారుల్లో ఎవరైనా చనిపోతే వారి స్ధానంలో కుటుంబ సభ్యులకు స్పౌజ్ పెన్షన్ కేటగిరీ కింద పెన్షన్లు అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీంతో కొత్తగా దరఖాస్తులు తీసుకుని లబ్దిదారుల్ని ఎంపిక చేసింది. వీరికి తొలిసారిగా జూన్ నెలలో పెన్షన్లు అందుతాయి. ఇకపై రెగ్యులర్ గా వీరికి కూడా మిగతా లబ్గిదారులతో పాటు పెన్షన్ అందిస్తారు. మిగిలిన కొత్త పెన్షన్ల విషయంలో ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications