బాక్సాఫీస్ వద్ద అద్భుతం.. అన్న సినిమాకు రోజురోజుకూ పెరుగుతున్న వసూళ్లు..!
మన దగ్గర థ్రిల్లర్, యాక్షన్, హార్రర్ మూవీస్ బాగా ఆడుతుంటాయి. ముఖ్యంగా మలయాళం సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూస్తుంటారు. అది థియేటర్ లో అయినా.. లేక ఓటీటీ అయినా.. ఇప్పటికే చాలా మలయాళం సినిమాలు తెలుగులోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అంతేకాక భారీగా కలెక్షన్స్ ను కూడా రాబట్టాయి. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, క్రియేటివ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ దృశ్యం 3. ఈ ఫ్రాంచైజ్ మూవీకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. 2013 లో దృశ్యం సినిమా రిలీజైంది. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
దాంతో 2021 లో ఆ చిత్రానికి కొనసాగింపుగా దృశ్యం 2 సినిమాను తెరకెక్కించారు. అది కూడా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు దృశ్యం 3 తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ కథను థ్రిల్లింగ్ గా సస్పెన్స్, ట్విస్టులతో రూపొందించి మరోసారి బ్లాక్ బస్టర్ సాధించింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో దృశ్యం 4 కు లైన్ క్లియర్ అయింది. అయితే దృశ్యం 3 మూవీకి మొదట నెగటివ్ టాక్ వచ్చింది. కథ క్లైమాక్స్ వరకూ స్లో గా సాగుతుందని చివరి 30 నిమిషాలు మాత్రమే ట్విస్టులు, సస్పెన్స్ ఉన్నాయని టాక్ బయటకు వచ్చింది. కానీ ప్రేక్షకులు అవేమీ పట్టించుకోవడం లేదు. దాంతో ఈ మూవీకి కలెక్షన్స్ భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడం, ఇతర పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో మోహన్ లాల్ సినిమాలు జనాలు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది.

దృశ్యం 3 మూవీ విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది. మలయాళ సినీ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి. ప్రస్తుతం సినిమా జోరు చూస్తుంటే ఫుల్ రన్‌లో రూ.300 కోట్ల మార్క్‌ను కూడా అందుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు సినీ పండితులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రస్తుతం లోక పేరిట ఉన్న ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ రికార్డును కూడా దృశ్యం-3 మూవీ చెరిపేస్తుందని టాక్ వినిపిస్తోంది. మరి ఫుల్ రన్ లో మోహన్ లాల్ సినిమా ఇంకెన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications