ఆ దేశ ప్రధాని తెలుగు సినిమాల్లో నటించిందని తెలుసా..?
భారతీయ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్‌గా వెలిగి.. ఆ తర్వాత ఆధ్యాత్మిక బాట పట్టి, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన వర్చువల్ దేశం 'కైలాస' (Kailasa) లో అత్యున్నత స్థానంలో ఉన్నారు నటి రంజిత (Ranjitha). కాగా రంజిత 90వ దశకంలో సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా ఉండేవారు. అయితే వివాదాస్పద స్వయం ప్రకటిత దైవం నిత్యానంద పరిచయంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది.
కాగా నిత్యానంద ఆశ్రమంలో చేరిన తర్వాత ఆమె తన పేరును 'మా నిత్యానందమయి' (Maa Nithyanandamayi) గా మార్చుకున్నారు. సినిమా రంగుల ప్రపంచాన్ని పూర్తిగా వదిలేసి, కాషాయ వస్త్రాలు ధరించి నిత్యానంద ప్రధాన అనుచరురాలిగా మారారు. నిత్యానంద స్థాపించిన వర్చువల్ ద్వీప దేశం 'కైలాస' లో రంజిత ప్రస్తుతం అత్యంత కీలకమైన పదవి అయిన "ప్రధాని" గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిత్యానంద తర్వాత ఆ దేశంలో సర్వహక్కులు, నిర్ణయాలు తీసుకునే సర్వాధికారిణి ఆమెనే కావడం గమనార్హం. అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. కైలాసకు సంబంధించిన అంతర్జాతీయ దౌత్య సంబంధాలు, ఐక్యరాజ్యసమితి (UN) సమావేశాలకు తమ ప్రతినిధులను పంపడం, ఆశ్రమ డిజిటల్, ఆర్థిక నెట్‌వర్క్‌ను పర్యవేక్షించడంలో ఆమెదే తుది నిర్ణయం.

తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ ఇమేజ్..
ఆధ్యాత్మిక రంగంలోకి రాకముందు రంజిత తమిళ చిత్ర పరిశ్రమలో (కోలీవుడ్) టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణించారు. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన 'నాదోడి పట్టుకారన్' (1992) సినిమాతో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నటుడు కార్తీక్ సరసన 'చిన్న గౌండర్', యాక్షన్ కింగ్ అర్జున్ సరసన 'జై హింద్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించి హీరోయిన్‌గా ఎదిగారు. అలానే రజనీకాంత్, కమల్ హాసన్ వంటి మహానటుల చిత్రాలలోనూ ఆమె కీలక పాత్రలు పోషించి, తన సహజసిద్ధమైన నటనకు గాను ప్రతిష్టాత్మక 'ఫిలింఫేర్' అవార్డును కూడా అందుకున్నారు.
తమిళంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ (టాలీవుడ్) రంజిత తనదైన ముద్ర వేశారు. టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు సరసన నటించిన 'కెప్టెన్', అలాగే సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'తాజ్ మహల్' (1995) వంటి సినిమాలు రంజితకు తెలుగు ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'మావిచిగురు' (1996) సినిమాలో ఆమె అద్భుత నటనను కనబరిచారు. ఆ తర్వాత శ్రీకాంత్ నటించిన 'ఎగిరే పావురమా' చిత్రంలో కూడా ఆమె నటించి మెప్పించారు.
కేవలం హీరోయిన్‌గానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకున్నారు. సినీ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే నిత్యానందతో ముడిపడిన ఓ వివాదాస్పద వీడియో బయటకు రావడంతో రంజిత పేరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆమెపై అనేక లీగల్ కేసులు, విమర్శలు వచ్చినప్పటికీ.. వాటన్నింటినీ పక్కన పెట్టి ఆమె నిత్యానంద మార్గంలోనే నడిచారు. ప్రస్తుతం భారతదేశానికి దూరంగా, కైలాస దేశ ప్రతినిధిగా డిజిటల్ మాధ్యమాల ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు












Click it and Unblock the Notifications