లయన్ వర్సెస్ హైనాస్-0 ప్లస్ 0 ఈజ్ 0- 2024 ఎన్నికలపై సాయిరెడ్డి జోస్యం..
ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాల పోరు కొనసాగుతోంది. ఇందులో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. అమరావతి రాజధానితో మొదలుపెట్టి పలు అంశాల్లో విపక్షాలు ఒకే గళం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి కూడా వాస్తవ పరిస్ధితి అర్ధమైనట్లే కనిపిస్తోంది. ఇవాళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్ చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది.
విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ఏం జరగబోతోందనేది జోస్యం చెప్పారు. అలాగే ఈ ఎన్నికల్లో పోరు ఎలా ఉండబోతోందో కూడా చెప్పేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితుల్లో వైఎస్ జగన్ వర్సెస్ విపక్షాలుగా కొనసాగుతున్న పోరు 2024 నాటికి ఎలా మారబోతోందన్నది కూడా సాయిరెడ్డి తేల్చిచెప్పేశారు. అదే సమయంలో వైఎస్ జగన్ పై తన అభిమానాన్ని కూడా సాయిరెడ్డి మరోసారి చాటుకుంటూనే విపక్షాలపై ఆక్రోశం వెళ్లగక్కారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ వైరల్ అవుతోంది.

విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో వైఎస్ జగన్ ను సింహంతోనూ, విపక్షాలను హైనాలతోనూ పోల్చారు. 2024 ఎన్నికల్లో పోరు సింహం వర్సెస్ హైనాలుగానే ఉండబోతోందని సాయిరెడ్డి స్పష్టం చేశారు. ఇందులో విపక్షాలను గందరగోళంలో ఉన్న హైనాలుగా సాయిరెడ్డి పేర్కొన్నారు. అలాగే సున్నా సున్నా కలిస్తే అప్పటికీ సున్నాయే వస్తుందంటూ విపక్షాల పరిస్ధితిని పేర్కొన్నారు. వైసీపీకి మాత్రం 175కు 175 సీట్లు వస్తాయని సాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాల కోసం తాము పనిచేస్తామన్నారు.












Click it and Unblock the Notifications