Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ పోరు వేళ సాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్..!

విజయనగరం జిల్లాలో కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్న భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో ఇప్పటికే ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ ఎయిర్ పోర్టును తామే తెచ్చామని, నిర్మించామని, పూర్తి చేశామని ఇలా ఇరు పార్టీలూ తమ వాదన వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం ఎవరి తెస్తే ఏమైంది, పోర్టు అయితే అందుబాటులోకి వస్తోంది కదా అని అనుకుంటున్నారు.

భోగాపురం ఎయిర్ పోర్టును గతంలో తామే ప్రారంభించామని టీడీపీ చెప్పుకుంటోంది. మధ్యలో జగన్ హయాంలో కొన్ని పనులు జరిగినా పూర్తి కాలేదని, కానీ ఇప్పుడు తిరిగి తాము అధికారంలోకి వచ్చాకే పూర్తి చేశామని చెబుతోంది. అయితే విపక్ష వైఎస్సార్సీపీ మాత్రం జగన్ హయాంలోనే ఈ పోర్టు పనులు ప్రారంభించామని, దాదాపుగా పనులు పూర్తయ్యాక తాము అధికారం కోల్పోయామని, కాబట్టి ఈ పోర్టు క్రెడిట్ తమకే దక్కాలని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ విజయసాయిరెడ్డి కూడా ఈ పోరులో దూరారు.

vijayasai reddy interesting tweet amid tdp-ysrcp s bhogapuram airport credit fight

భోగాపురం ఎయిర్ పోర్టులో తొలి కమర్షియల్ ఫ్లైట్ ల్యాండ్ కావడంపై విజయసాయిరెడ్డి ఇవాళ ఓ ట్వీట్ చేసారు. ఇందులో ఆయన..భోగాపురం విమానాశ్రయంలో తొలి టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ కావడం చూసి ఆనందంగా ఉందన్నారు. పార్లమెంటులో మరియు మంత్రులతో సమావేశాల ద్వారా ఈ విమానాశ్రయానికి సంబంధించిన సమస్యలను తాను నిరంతరం లేవనెత్తానని గుర్తుచేసుకున్నారు. వైజాగ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఈ ప్రాజెక్ట్ సిద్ధంగా ఉండటం చూడటం హృదయపూర్వకంగా ఉందన్నారు. తద్వారా తన క్రెడిట్ తాను తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇక్కడితో అయినా ఈ క్రెడిట్ వార్ ఆగుతుందో లేదో చూడాలి మరి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+