Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు నట విశ్వరూపం, సింపతి గేమ్ అంటూ విజయసాయి రెడ్డి విసుర్లు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటంబంపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై టీడీపీ నేతలతోపాటు నందమూరి కుటుంబం కూడా వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. తన భార్య, తన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేశారని, అవమానించారంటూ చంద్రబాబు నాయుడు కన్నీటిపర్యంతమైన నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.

సింపతీ గేమ్ అంటూ చంద్రబాబుపై విజయసాయి రెడ్డి

సింపతీ గేమ్ అంటూ చంద్రబాబుపై విజయసాయి రెడ్డి

తాజాగా, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. చంద్రబాబుపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. 'సింపతీ గేమ్‌లో చంద్రబాబు ఈవెంట్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ మరింత పదును తేలాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పేరుతో సంస్కారం, పెంపకాల మీద ప్రెస్ మీట్లు పెట్టించాడు. వాళ్లు అమాయకులు కాబట్టే వెన్నుపోటు పొడిచావ్. ఆరోజున పెద్దాయనను గాలికొదిలేసి, నీ వెంట నడిచింది వీళ్లే కదా?' అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నట విశ్వరూపం అంటూ విజయసాయి రెడ్డి

చంద్రబాబు నట విశ్వరూపం అంటూ విజయసాయి రెడ్డి

'చంద్రబాబు ఏం చేసినా రాజకీయ లాభనష్టాలు ముందే అంచనా వేసుకుంటాడు. గుళ్లను కూల్చాడు, రథాలు తగలబెట్టించి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టాలని చూసి భంగపడ్డాడు. చివరకు తన కుటుంబాన్ని తానే బజారున పడేసుకున్నాడు. ఇది పక్కా రాజకీయ విన్యాసం తప్ప ప్రతిష్టకు సంబంధించిన అంశమే కాదు. ఇసుకలో పిచ్చుక గూళ్లు కట్టుకుని ఆడుకునే పిల్లలు గాలికి అవి కూలిపోతే ఏడ్చినట్టుగా ఉంది బాబు నట విశ్వరూపం. మీ ఏడుపులకు ఎవరూ కారణం కాదు. ఇంకెక్కడో ఏదో సానుభూతి మిగిలి ఉంటుందని ఆశ. అలిపిరి వద్ద బాంబు పేలుడులోనే రాని సింపతీ ఇప్పుడెలా వస్తుంది బాబూ?' అంటూ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

చంద్రబాబు కొత్త డ్రామాలంటూ ద్వారంపూడి

చంద్రబాబు కొత్త డ్రామాలంటూ ద్వారంపూడి


మరోవైపు, వైసీపీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. విశాఖలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన అసెంబ్లీలో జరిగిన వ్యవహారంపై వివరణ ఇచ్చారు.
సానుభూతి కోసమే చంద్రబాబు కొత్త డ్రామా మొదలుపెట్టారన్నారు. బాబు సతీమణి భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనలేదని స్పష్టం చేశారు. ఆమెను అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ ధ్వజమెత్తారు. కావాలంటే అసెంబ్లీ రికార్డులు పరిశీలించుకోవచ్చని సూచించారు. అసెంబ్లీలో జరిగింది వేరు.. బయట జరుగుతున్న ప్రచారం వేరన్నారు. చంద్రబాబు తన సతీమణిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారని మరోసారి దుయ్యబట్టారు.

Recommended Video

    రైతులకు అన్యాయం జరిగితే సహించమన్న భట్టి విక్రమార్క || Oneindia Telugu
    ఎన్టీఆర్ కుమార్తెగా భువనేశ్వరిని గౌరవిస్తాం..

    ఎన్టీఆర్ కుమార్తెగా భువనేశ్వరిని గౌరవిస్తాం..

    గతంలో హెరాయిన్ కేసులో తన పాత్ర ఉందని తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తనను ఒక మాట అంటే.. నాలుగు మాటలు అంటానన్నారు. టీడీపీ నాయకులు ఆలోచించి మాట్లాడాలన్నారు. దివంగత నేత ఎన్టీ రామారావు కుటుంబాన్ని ఏకం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు ద్వారంపూడి. ఎన్టీయార్ కుమార్తెగా భువనేశ్వరిని గౌరవిస్తామన్నారు. అసెంబ్లీలో జరిగిన వ్యవహారంపై నందమూరి కుటుంబ సభ్యులకు అవగాహన లేదని, త్వరలో నందమూరి కుటుంబ సభ్యులు జరిగిన విషయం తెలుసుకుంటారని అన్నారు. భువనేశ్వరి కోసం రన్నింగ్ కామెంట్రీలో కూడా ఎవరు కనీసం మాట్లాడలేదన్నారు. అనవసరంగా చంద్రబాబు మాయ ఉచ్చులో పడకండి అంటూ నందమూరి కుటుంబసభ్యులకు సూచించారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అసెంబ్లీ తన సతీమణి భువనేశ్వరిపైనా విమర్శలు చేశారని, అవమానించారంటూ మీడియా సమావేశంలో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నందమూరి కుటుంబం మీడియా ముందుకు వచ్చి.. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ సహించేది లేదని నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+