నారాయణ! నారాయణ! దొరికితే వదిలిపెడతారా విజయసాయి రెడ్డి!!
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తెలుగుదేశం పార్టీ నేతలను నిత్యం టార్గెట్ చేసే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టిడిపి పై విరుచుకుపడ్డారు. వరుస ట్వీట్ లతో రెచ్చిపోయారు. టిడిపి నేత నారాయణ పై ఆయన తమ్ముడి భార్య ప్రియ సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ ఒక డేగలా తనపై కన్నేశారు అని, తనని చిత్రహింసలకు గురి చేశారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
తనని తిట్టే వాడని, కొట్టేవాడని, ఓ పిట్టను డేగ ఎత్తుకెళ్లినట్టు తన పరిస్థితి మారిందని తనని చిత్రహింసలకు గురి చేసేవారు అంటూ నారాయణ తమ్ముడు భార్య ప్రియ ఆరోపించారు. ప్రస్తుతం ఇది ఏపీ రాజకీయాలలో కలకలం రేపగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా నారాయణను టార్గెట్ చేశారు.

వావీ వరసలు లేకుండా సొంత కుటుంబసభ్యులనే కాదు ప్రజల్ని, చివరికి తన సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, చదువుకుంటున్నమైనర్ బాలికలను కూడా ఇలానే వేధిస్తున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. గద్దలు, డేగలు కోడి పిల్లల్ని తన్నుకుపోవడానికి పైనుంచి గురి చూసినట్లే అమాయక అబలలపై కన్నేసి వారిని ఖతం చేస్తున్నారు...నారాయణ! నారాయణ! నారాయణ! అంటూ టిడిపి నేత మాజీ మంత్రి నారాయణపై పదునైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
అంతేకాదు ఇక ఇదే సమయంలో ప్రకాశం జిల్లాలో ఎన్టీఆర్ అభిమానులు కట్టిన ఫ్లెక్సీ పై లోకేష్ ను టార్గెట్ చేస్తూ చంద్రబాబుకు సెటైర్లు వేశారు. 'అసలోడు', 'కొసరోడు' అంతరార్థం ఏమిటో చంద్రబాబు గారే అధికారికంగా స్పష్టత ఇవ్వాలి అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మీపార్టీలోని జూ.ఎన్టీఆర్ అభిమానులు ప్రకాశం జిల్లాలో కట్టిన ఫ్లెక్సీల్లో 'అసలోడు' వచ్చేవరకే 'కొసరోడి'కి పండుగ అని రాసి ఉంది.
'కొసరోడు' అంటే ఆ జిల్లాలోయువగళం చేస్తున్న చినబాబు కాదు కదా? ప్రజలకు వచ్చిన సందేహాన్నే ప్రస్తావిస్తున్నాం అంటూ విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు. ఇక నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో యాంకర్ ఉదయభాను రావడంపై టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ఈవెంట్ మేనేజమెంట్‌లో టీడీపీ అధినేతను మించిన వారెవరూ ఉండరు అని పేర్కొన్నారు.
ప్రతి ప్రోగ్రాంకు ఏదోఒక 'అట్రాక్షన్' జతచేసి జనాన్ని మొబిలైజ్చేయడం ఆయనకు మొదటి నుంచీ అలవాటే అంటూ ఎద్దేవా చేశారు. చినబాబు యువగళం యాత్రకు గ్లామర్ అద్దేందుకు టీవీ యాంకర్‌ను హైదరాబాద్ నుంచి రప్పించడం చూశాం అని పేర్కొన్న ఆయన ఇక నుంచి సినీ నటుల సందడి మొదలవుతుందని అర్థమవుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications