ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!

అమరావతి (Amaravati)ని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ మావిగన్ పేరుతో కొత్త రాజధాని ప్రాంతాన్ని తెరపైకి తెచ్చి కూటమి సర్కార్ ను టార్గెట్ చేస్తోంది. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరుతో కూడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే అమరావతిలో పెట్టే ఖర్చు తప్పుతుందని, రాష్ట్ర ప్రజలపై భారం కూడా పడదని వైఎస్ జగన్ చేసిన ఈ ప్రతిపాదనపై రాష్ట్రంలో అనుకూల, వ్యతిరేక చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) స్పందిస్తూ సీఎం చంద్రబాబు (Chandrababu)కు కీలక సూచన చేశారు.

బెంగళూరును 1537లో కెంపె గౌడ, హైదరాబాద్‌ను 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, చెన్నైని 1639లో ఫ్రాన్సిస్ డే ఆధ్వర్యంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించాయని, అవి నేటి మహానగరాలుగా మారడానికి వరుసగా 500, 430, 380 సంవత్సరాలు పట్టిందని సాయిరెడ్డి గుర్తుచేశారు. ఈ నగరాలు హడావిడిగా నిర్మించలేదని, తరతరాలుగా రూపుదిద్దుకున్నట్లు వెల్లడించారు. అమరావతిని కూడా అప్పుల డబ్బుతో, గొప్ప భ్రమలతో రాత్రికి రాత్రే నిర్మించలేమన్నారు. ప్రత్యేకించి అది చెప్పుకుంటున్నట్లుగా స్వయం సమృద్ధి కానప్పుడు అలా చేయలేమన్నారు.

Vijayasai Reddy to Chandrababu Build Amaravati s Core Assembly Secretariat High Court and Stop

ముందుగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, మరియు ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన గృహాల వంటి ప్రాథమిక సౌకర్యాలను నిర్మించి, అక్కడితో ఆపాలని చంద్రబాబుకు సాయిరెడ్డి సలహా ఇచ్చారు. ప్రజలు, వ్యాపారాలు, మరియు కాలంతో పాటు అమరావతి సహజసిద్ధంగా ఎదగనివ్వాలన్నారు. ఒక రాజధాని నగరం బలం నుండి ఎదగాలి, అప్పుల నుండి కాదన్నారు. ఆకర్షణీయమైన డిజైన్లు, భారీ మౌలిక సదుపాయాలపై విచక్షణారహితంగా ఖర్చు చేయడం దార్శనికత కాదని, అది ఆర్థిక బాధ్యతారాహిత్యమే అన్నారు.

Vijayasai Reddy to Chandrababu Build Amaravati s Core Assembly Secretariat High Court and Stop

ఈ రోజు అనవసరంగా ఖర్చు చేసే ప్రతి రూపాయి రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై భారం అవుతుందన్నారు. ఆదాయం ఆర్జించని ప్రాజెక్టులకు ఇచ్చే రుణాలు శ్రేయస్సును సృష్టించవు, పైగా అవి ప్రజా ఖజానాపై భారం మోపుతాయన్నారు. పరిపాలనకు కార్యాచరణ అవసరం, ఆడంబరమైన కట్టడాలు కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం జాగ్రత్తను విస్మరిస్తే, అమరావతి ఒక ఆదర్శ రాజధానిగా కాకుండా, ఒక భారీ దుబారా కట్టడంగా మారే ప్రమాదం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+