జీఎస్టీ తరహాలో ఆదాయపు పన్నుకు మూడు స్లాబ్ లు ? సాయిరెడ్డి ప్రతిపాదన..!
ఏపీలో గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా, పార్లమెంటరీ పార్టీ నేతగా, ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ ఛార్జ్ గా ఇలా పలు హోదాల్లో హంగామా చేసిన విజయసాయిరెడ్డి.. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు. మధ్యలో మద్యం స్కాంలో విమర్శలు మినహా సైలెంట్ గానే ఉంటూ వచ్చారు. అనంతరం రాజకీయాలకూ, ఎంపీ పదవికీ గుడ్ బై చెప్పేశారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పేశారు. అయితే కొంతకాలంగా సాయిరెడ్డి కేంద్రానికి పలు కీలక విషయాల్లో ప్రతిపాదనలు చేస్తున్నారు.
ట్రంప్ సుంకాల మోతతో పాటు ఇప్పటికే పలు అంశాల్లో కేంద్రానికి ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్న విజయసాయిరెడ్డి.. ఇప్పుడు తాజాగా మరో కీలక ప్రతిపాదన చేశారు. కేంద్రం తాజాగా జీఎస్టీ స్లాబ్ లను నాలుగు నుంచి రెండుకు తగ్గించిన నేపథ్యంలో ఆదాయపు పన్ను స్లాబ్ లను కూడా మార్చాలని ఆయన ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఇందులో లాభనష్టాలను కూడా సాయిరెడ్డి వివరించారు.

జీఎస్టీకి రెండు స్లాబ్‌లు ఉంటే, ఆదాయపు పన్నుకు ఎందుకు ఉండకూడదని సాయిరెడ్డి తన ట్వీట్ లో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించారు. ₹12 లక్షల వరకు మినహాయింపు, ₹12-24 లక్షలకు 10% మరియు ₹24 లక్షలకు పైగా 20% ఉండాలని ఆయన కోరారు. తక్కువ స్లాబ్‌లు అంటే సులభంగా రిటర్న్ దాఖలు చేయడం, అధిక సమ్మతి, ప్రభుత్వానికి ఆదాయ ప్రమాదం లేకపోవడం వంటి ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఆదాయపు పన్ను శాఖ దృష్టి పన్ను బేస్‌ను పెంచడంపై మాత్రమే ఉండాలని సాయిరెడ్డి సూచించారు.
If GST can have 2 slabs, why not Income Tax? Exemption till ₹12 lakh, 10% for ₹12–24 lakh and 20% above ₹24 lakh. Fewer slabs means easier filing, higher compliance and no revenue risk for the Govt. Income tax department’s focus should only be to increase tax base. #IncomeTax…
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 16, 2025
ఇప్పటికే పలు కీలక అంశాలపై సాయిరెడ్డి ప్రతిపాదనలు చేస్తున్నా కేంద్రం వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన ఉండటం లేదు. ఇప్పుడు మరోసారి కీలకమైన ఆదాయపు పన్ను విషయంలో సాయిరెడ్డి చేసిన ప్రతిపాదనపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అయినా స్పందిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications