రాజకీయాలు చెయ్యటానికి పవన్ కు గ్రౌండ్ లేదన్న విజయసాయి .. ఘాటుగా బదులిచ్చిన నాగబాబు

ఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా మరోపక్క రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా అటు చంద్రబాబును , పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి విమర్శలు చేసే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్ మీద ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు మెగా బ్రదర్ నాగబాబుకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి.

ఇక ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా కరోనా కష్టకాలంలో రాజకీయాలు చెయ్యకుండా అందరం కరోనాపై పోరాటం సాగించాలని చెప్పిన పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. ఇక ట్విట్టర్ వేదికగా ఆయన "కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోందట. రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండే లేదు కదా పవన్. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని 'నేను లేస్తే మనిషిని కాదు' అని చిటికెలేసినట్టుగా ఉంది నీ వాలకం. ప్రజా తీర్పును అప్పుడే మర్చిపోతే ఎలా?" అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ మెగా బ్రదర్ నాగబాబుకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది .

 Vijayasai says Pawan lacks ground to do politics ... nagababu strong counter to MP

Recommended Video

    India Lockdown:PM Modi Interacts With Cheif Ministers Via Video Conference About Covid-19 & Lockdown

    ఇక దీనికి ఘాటుగా సమాధానం ఇస్తూ నాగబాబు "నువ్వు చెప్పింది కరెక్టే . ఈ ఎదవ రాజకీయాలు చేయటానికి నీ లాంటి గుంటనక్కలున్న సంగతి మాకుతెలుసు విజయ సాయి రెడ్డి అంటూ నిపులు చెరిగారు . అంతే కాదు మరి మన ఇద్దరి కామన్ స్నేహితుడి ద్వారా నా ఇంటికి వచ్చి పవన్ తో దోస్తీ కి రెడి అన్నమీ గుంట నక్కరాజకీయలు నాకు గుర్తున్నాయి" అంటూ విజయసాయిరెడ్డి కి రివర్స్ కౌంటర్ ఇచ్చారు నాగబాబు . ఇక గతంలో కూడా పవన్ కళ్యాణ్ తమతో పొత్తుకు పలుమార్లు ప్రయత్నం చేశారని బాహాటంగానే చెప్పారు. ఇప్పుడు విజయసాయి వ్యాఖ్యలతో నాగబాబు గుంటనక్క రాజకీయాలు చేస్తున్నావని, అందుకే దోస్తీ కోసం వెతుక్కుంటా వచ్చారా అని మండిపడ్డారు .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+