మెదక్ లోకసభ స్థానం: కెసిఆర్‌పై పోటీకి రాములమ్మ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తరపున మెదక్ లోకసభ స్థానం నుంచి తానే పోటీ చేస్తానని పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి శనివారం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆ పార్టీ తరఫున మెదక్ లోకసభ బరిలో నిలిస్తే తాను ఆయనపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాగా, తెరాస నుంచి ఇటీవల ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. కెసిఆర్ మెదక్ నుండి లోకసభకు, గజ్వెల్ నుండి అసెంబ్లీకి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
తెలంగాణలో సిపిఐ, కాంగ్రెస్, తెరాస కలిసి సమన్వయంతో పోటీ చేస్తే బాగుంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ వేరుగా అన్నారు. తమతో సిపిఎం కలిస్తే మరీ మంచిదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను కొందరు అంటరాని పార్టీగా చూస్తున్నారని, అందుకు తాము సిద్ధంగా లేమన్నారు.

సిపిఐ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పొత్తులు, ఇతర విషయాలు చర్చించేందుకు తెలంగాణ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశామన్నారు.
ఎన్నికల వ్యూహంలో భాగంగా సిపిఎంతో భేటీ జరిగిందని, స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించామన్నారు. ఎన్నికల్లో పొత్తులపై త్వరలోనే తెరాస, కాంగ్రెస్‌లతో చర్చిస్తామన్నారు. పొన్నాల లక్ష్మయ్యను అభినందించేందుకు వెళ్లిన సమయంలో అనుకోకుండా దిగ్విజయ్‌ను కలిశాను తప్ప, ఎలాంటి రాజకీయాలు చర్చించలేదన్నారు.












Click it and Unblock the Notifications