మెదక్ లోకసభ సీటుపై కన్నేసిన విజయశాంతి?
హైదరాబాద్: కాంగ్రెసు అభ్యర్థిగా మెదక్ శాసనసభా స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విజయశాంతి లోకసభ స్థానంపై కన్నేశారు. మెదక్ లోకసభ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. రెండు ప్రాంతాల్లోనూ లోకసభ స్థానాల్లో గెలిచిన అభ్యర్థుల్లో అత్యధిక మెజారిటి సాధించిన ఘనత కెసిఆర్‌కే దక్కింది.
గజ్వెల్ శాసనసభా నియోజకవర్గం నుంచి కూడా గెలిచిన కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టునున్నారు. దీంతో ఆయన మెదక్ లోకసభ స్థానానికి రాజీనామా చేయడం ఖాయమైంది. ఆయన రాజీనామా చేసిన ఆరు నెలల లోపల మెదక్ లోకసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.

కెసిఆర్ రాజీనామాతో ఖాళీ అయ్యే మెదక్ లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసేందుకు విజయశాంతి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఆమె గతంలో ఈ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కాగా, సంగారెడ్డి శాసనసభా స్థానం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జగ్గారెడ్డి మెదక్ లోకసభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడినట్లు, అందుకు పవన్ కళ్యాణ్ మద్దతు కూడా కోరినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, ఆయన తాను బిజెపిలో చేరడం లేదని, కాంగ్రెసులోనే ఉంటానని చెప్పారు. కాంగ్రెసు అభ్యర్థిగా ఆయన మెదక్ లోకసభ స్థానం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా అనేది తేలడం లేదు. అయితే, తెరాస నాయకులు పలువురు మెదక్ లోకసభ స్థానం టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
గతంలో ఎమ్మెల్సీగా పోటి చేసి గెలిచి అర్థాంతరంగా రాజీనామా చేసిన ఆర్ సత్యనారాణతో పాటు కొత్త ప్రభాకర్ రెడ్డి, రమణాచారి, మైనంపల్లి హనుమంతరావు, దేశపతి శ్రీనివాస్ మెదక్ లోకసభ సీటు నుంచి తెరాస అభ్యర్థులుగా పోటీ పడుతున్నట్లు సమాచారం. వీరందరు కూడా కెసిఆర్‌కు సన్నిహితులైనవారే. రమణాచారికి ఇది వరకే ఈ విషయంపై హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications