టికెట్ లేని ప్రయాణికులకు బిగ్ షాక్..! ఒక్క రోజులో 35 లక్షలు వసూలు..!
దసరా సీజన్ లో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా ప్రతీ రోజూ ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు.. అదే సమయంలో టికెట్ లేకుండా ప్రయాణాలు చేస్తున్న వారిపై కొరడా ఝళిపిస్తున్నారు. ఇందులో భాగంగా
నిన్న విజయవాడ డివిజన్ పరిధిలో మెగా టికెట్ చెకింగ్ డ్రైవ్ జరిగింది. దీనిలో భారీగా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని గుర్తించారు. వీరిపై జరిమానాల మోత మోగించారు.
ఈ డ్రైవ్‌లో భాగంగా ఒకే రోజులో 4,907 అక్రమ ప్రయాణ కేసులు నమోదు చేయడం ద్వారా రికార్డు స్థాయిలో రూ.35.16 లక్షలు జరిమానా వసూలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది అత్యధికం. డివిజన్ వ్యాప్తంగా 196 రైళ్లను తనిఖీలు చేశారు. స్క్వాడ్ టిటిఇలు, స్టేషన్ సిబ్బంది, ప్రో-కమర్షియల్ క్లర్క్‌లు/టికెట్ కలెక్టర్లు ఈ భారీ ఆపరేషన్‌లో పాల్గొన్నారని రైల్వే వర్గాలు ప్రకటించాయి.

ఉదయం, మధ్యాహ్నం 12 గంటల చొప్పున రెండు స్లాట్‌లలో ఈ డ్రైవ్ నిర్వహించారు. ఆర్పీఎఫ్ సాయంతో ప్రతీ స్టేషన్ లోనూ ప్రయాణీకులను ఆపి ఈ తనిఖీలు చేశారు. ప్రయాణీకులను కౌంటర్ల నుండి ప్రయాణ లేదా ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను కొనుగోలు చేసేలా మార్గనిర్దేశం చేశారు. ఈ ఇంటెన్స్ టికెట్ చెకింగ్ డ్రైవ్‌లో, టికెట్ లేకుండా ప్రయాణించిన 2257 కేసులు, 2321 అక్రమ ప్రయాణ కేసులు నమోదు చేశారు. అలాగే టికెట్ చెకింగ్ సిబ్బంది వరుసగా రూ.22.89 లక్షలు, రూ.12.19 లక్షల జరిమానా విధించారు.

విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం బి.ప్రశాంత కుమార్ మాట్లాడుతూ.. ఈ భారీ టికెట్ చెకింగ్ డ్రైవ్ టికెట్ లేకుండా , అక్రమ ప్రయాణాన్ని అరికట్టడానికి , బుక్ చేసుకోని లగేజీ క్యారేజీని అరికట్టడానికి చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో భాగమన్నారు. ఇటువంటి తనిఖీలు ఆదాయ లీకేజీని అరికట్టడమే కాకుండా క్రమశిక్షణ , జవాబుదారీతనాన్ని కూడా పెంపొందిస్తాయన్నారు. తద్వారా నిజమైన రైలు ప్రయాణీకులకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని నిర్ధారిస్తాయన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications