వరద సహాయక చర్యల్లో వైసీపీ

Vijayawada floods 2024: కనివినీ ఎరుగని విధంగా సంభవించిన విపత్తు.. రెండు తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలానికి గురి చేసింది. అతి భారీ వర్షాల వల్ల ఏపీ, తెలంగాణ దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా ఉండట్లేదు. నదులు, చెరువులు ఏకం అయ్యాయి. జనావాసాలన్నీ జలమయం అయ్యాయి.

ప్రత్యేకించి- రాజధాని అమరావతి మొత్తం నీట మునిగింది. విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వరద ఉధృతి నెలకొంది. వేలాదిమందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు.

Vijayawada floods 2024 YSRCP kick starts food supply in flood affected areas

ఇప్పుడిప్పుడే వరద తీవ్రత తగ్గుముఖం పడుతోంది. విజయవాడ మొత్తం బురదమయమైంది. రోడ్లపై భారీగా బురద పేరుకుపోయింది. దీన్ని ఎక్కడికక్కడ తొలగించేలా చర్యలను చేపట్టింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. అదే సమయంలో విజయవాడలో రాత్రి నుంచి మోస్తరు వర్షు తోండటం ఆందోళనకు గురి చేస్తోంది.

ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. లక్ష పాల ప్యాకెట్లు, రెండు లక్షల వాటర్‌ బాటిళ్లు పంపిణీ మొదలుపెట్టింది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్.. వంటి పార్టీ సీనియర్ నాయకులు వరద బాధితులకు మంచినీళ్లు, పాలు, ఆహారాన్ని అందజేస్తోన్నారు.

విజయవాడలోని 16,17వ డివిజన్లలో ఈ ఉదయం నుంచి పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వరదల నేపథ్యంలో ఇప్పటికే పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. వరద బాధితుల సహాయార్థం పార్టీ తరఫున కోటి రూపాయల విరాళం ఇవ్వాలని జగన్‌ నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+