టీడీపీలోకి కేశినేని నాని రీఎంట్రీ ? వాళ్లు ఒప్పుకుంటే- విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని క్లారిటీ..!
ఏపీలో గతంలో రెండుసార్లు విజయవాడ లోక్ సభ స్ధానం నుంచి టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని పార్టీలో ఆధిపత్య పోరు నేపథ్యంలో రూటు మార్చారు. గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పేసి ఇతర వ్యాపకాల్లో ఉంటున్నారు. అయితే కొన్ని రోజులుగా కేశినేని నాని రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
గతంలో టీడీపీలో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన కేశినేని నాని పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లాక పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ పైనా తీవ్ర విమర్శలు చేశారు. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయాక మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మధ్యలో తిరిగి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగినా ఆయన మాత్రం దాన్ని ఖండించారు. అయినా ప్రచారం మాత్రం ఆగలేదు. కేశినేని తిరిగి టీడీపీలోకే రాబోతున్నట్లు తాజా ప్రచారం సారాంశం. దీనిపై ఆయన సోదరుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు.

ఇవాళ తిరుపతిలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని.. తన సోదరుడు కేశినేని నాని తిరిగి పార్టీలోకి వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. కూటమి నాయకులంతా ఒకే తాటిపై ఉన్నామని ఆయన తెలిపారు. కూటమిలో ఇతర పార్టీల నేతల చేరికల నేపథ్యంలో ఓ కమిటీ వేసుకున్నామని, పవన్, చంద్రబాబు, మోడీని గతంలో తీవ్రంగా విమర్శించిన నాయకుల్ని తిరిగి ఎట్టి పరిస్ధితుల్లో తిరిగి తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చిన్ని తెలిపారు. కాబట్టి ఆ కోవలోకి రాకపోతే కేశినేని నానిని తీసుకుంటారని, వస్తే మాత్రం తీసుకోరని తేల్చిచెప్పేశారు. ఏదైనా కమిటీ నిర్ణయాన్ని బట్టి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications