Kesineni War: సోషల్ మీడియా రోడ్లపై సైకో.. కేశినేని నానికి ఎంపీ చిన్ని ఘాటు కౌంటర్..!
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మాజీ ఎంపీ, ఆయన సోదరుడు కేశినేని శ్రీనివాస్(నాని) మధ్య వార్ మరింత ముదిరింది. గత ఎన్నికల్లో సోదరుడు చిన్ని చేతిలో ఓటమి పాలయ్యాక సైలెంట్ అయిపోయి అనంతరం రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన నాని తాజాగా మళ్లీ స్వరం విప్పుతున్నారు.
తొలుత విశాఖలో ఉర్సా క్లస్టర్స్ వ్యవహారంలో చిన్ని పాత్రపై ఆరోపణలు గుప్పించిన కేశినేని నాని.. ఇప్పుడు విజయవాడలో చిన్ని అరాచకాల్ని ప్రశ్నిస్తూ ఫేస్ బుక్ పోస్టు పెట్టారు. దీనిపై ఇవాళ చిన్ని ఎక్కడా నాని పేరెత్తకుండానే ఘాటుగా బదులిచ్చారు.

తాజాగా ఫేస్ బుక్ లో కేశినేని నాని ఓ పోస్టు పెట్టారు. ఇందులో విజయవాడ ఎన్టీఆర్ భవన్. ఇది విజయవాడ ప్రజలు చరిత్రలో లేని విధంగా భారీ మెజారిటీతో తనను గెలిపించుకున్నారు అని గర్వంగా చెప్పుకునే ప్రజాప్రతినిధిగారి కార్యాలయం పేరు. కానీ ఇక్కడ కూర్చుని ఆయన చేసేది ఇసుక వ్యాపారం , ఫ్లై ఆష్ తోలకం, గ్రావెల్ అమ్మకం, భూ దందాలు , బ్రోకరేజీలు, పేకాట గృహాలు, రేషన్ బియ్యం మాఫియా దగ్గర వసూళ్లు వగైరా వగైరా అన్నారు.
ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నీతికి నిజాయతీకి మారుపేరు ప్రజా సేవ అంటే చాలా పవిత్ర కార్యక్రమం అని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు అని కేశినేని నాని తెలిపారు. కాబట్టి నీ కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చి ఛార్లెస్ శోభరాజ్ భవన్ అని పేరు పెడితే బాగుంటుందని నిన్ను భారీ మెజార్టీతో గెలిపించిన విజయవాడ ప్రజల కోరిక అంటూ కేశినేని నాని ఫేస్ బుక్ పోస్టులో తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక.సోషల్ మీడియా రోడ్ల మీద మతి బ్రమించి తిరుగుతున్న సైకో.చిప్పు దొబ్బి సోషల్ వాల్స్ పై కసి,పగ, ద్వేషంతో రగిలిపోతూ విజయవాడ అభివృద్ధిపై విషం చిమ్ముతున్న సైకో.స్పందించాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉండండి.
— Kesineni Sivanath (@KesineniS) April 23, 2025
మీ
కేశినేని శివనాథ్(చిన్ని)-MP
కేశినేని నాని పెట్టిన ఈ ఫేస్ బుక్ పోస్టు సోదరుడు, ఎంపీ కేశినేని చిన్నికి మంటపుట్టించింది. దీంతో ఇవాళ ఆయన ఎక్స్ లో ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక.సోషల్ మీడియా రోడ్ల మీద మతి బ్రమించి తిరుగుతున్న సైకో.చిప్పు దొబ్బి సోషల్ వాల్స్ పై కసి,పగ, ద్వేషంతో రగిలిపోతూ విజయవాడ అభివృద్ధిపై విషం చిమ్ముతున్న సైకో.స్పందించాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉండండి అంటూ రెచ్చిపోయారు. ఇందులో ఎక్కడా నాని పేరు లేకపోయినా ఈ ట్వీట్ నాని గురించే అని ఆయన అభిమానులు అర్ధం చేసుకుని దీనికి రిప్లై ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications