విజయవాడలో ఓటుకు నోటు..!ఆయా పార్టీల రేట్లు ఇవే: ఏబీవీ వర్గం
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇవాళ ముగియబోతోంది. సాయంత్రానికి ప్రచార హోరు ముగించుకుని పోలింగ్ కోసం పార్టీలు, అభ్యర్ధులు సిద్దం కావాల్సి ఉంది. అయితే పోలింగ్ వరకూ ఆగకుండా ముందే ఓటర్లకు డబ్బులు పంచేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించేశాయి. ఇందులో భాగంగా కీలకమైన విజయవాడ (Vijayawada) మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోనూ ధన ప్రవాహం జోరుగా సాగుతోంది. వీటి వివరాలను ఈ ఎన్నికల్లో కూటమి, వైసీపీ అభ్యర్ధులకు గట్టి పోటీ ఇస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు వర్గం బయటపెట్టింది.
విజయవాడలో ప్రస్తుతం కూటమి అభ్యర్దిగా జనసేన నేత వంగవీటి రాధాకృష్ణ, వైసీపీ అభ్యర్దిగా రాయన భాగ్యలక్ష్మి పోటీ చేస్తున్నారు. వీరికి పోటీగా స్వతంత్ర అభ్యర్ధిగా, కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతుతో మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు రంగంలో నిలిచారు. అయితే ఆయన ఎన్నికల్లో తాను డబ్బు పంచేది లేదని తేల్చిచెప్పేశారు. దీంతో ఆయన ఇప్పుడు తనకు పోటీగా ఉన్న ఇద్దరు అభ్యర్ధులు, పార్టీల ఎత్తుగడల్ని బయటపెట్టేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

ఇందులో భాగంగా విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్ధులు ఓట్ల కోసం ఎంతెంత డబ్బు పంచుతున్నారనేది ఏబీ వెంకటేశ్వరరావు వర్గం బయటపెట్టింది. విజయవాడలో భారీ వరద! అంటూ ఏబీవీ టీమ్ లో కీలకంగా ఉన్న సామాజిక కార్యకర్త నల్లమోతు చక్రవర్తి ట్వీట్ చేశారు. ఇందులో ఆయన గత రాత్రి విజయవాడలో మధ్యం ఏరులై పారింది, నోట్ల కట్టల వరద వచ్చిందని తెలిపారు. వైసీపీ ఓటుకి 500 రూపాయలు పంచితే, జనసేన/టీడీపీ/బీజేపీ కూటమి 1000 రూపాయలు పంచిందన్నారు. తద్వారా ఈ ఎన్నికల్ని ఆయన పార్టీలు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాయో వెల్లడించారు.

మరోవైపు ఇంత తీవ్రంగా సాగుతున్న పోటీలో ఏబీవీ ఓట్లు చీలుస్తారని, లేకపోతే గెలుస్తారనే భయంతో ఆయన్ను ఇరు పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా తప్పతాగిన మూకలు ఏబివి ప్రచార వాహనాలను ధ్వంసం చేశాయని నల్లమోతు చక్రవర్తి ట్వీట్ లో తెలిపారు. ఈ విష సంస్కృతి పోవాలి, మీ ఓటు పాలకులకు కోట్లు కాకూడదు, దొంగలు పోవాలి. పోలీసు రావాలి! అంటూ ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.














Click it and Unblock the Notifications
