జగన్ కోడి కత్తి కేసులో భారీ ట్విస్ట్-ఎన్ఐఏ కోర్టు కీలక తీర్పు-ఏం జరగబోతోంది ?

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై 2019 ఎన్నికల సమయంలో వైజాగ్ ఎయిర్ పోర్టులో జరిగిన కోడి కత్తి దాడి కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే పలు ట్విస్టులు చోటు చేసుకుంటుండగా.. ఇప్పుడు వాటన్నింటినీ తలదన్నేలా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐఏ కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్ లో చేసిన వాదనను విజయవాడ ఎన్ఐఏ కోర్టు అంగీకరించింది.

వైఎస్ జగన్ పై కోడి కత్తి దాడి కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐఏ.. ఇందులో కుట్రేమీ లేదని తేల్చేసింది. దీన్ని సవాల్ చేస్తూ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తులో పలు కీలక అంశాల్ని విస్మరించిందని, కాబట్టి తిరిగి సమగ్ర దర్యాప్తు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఎన్ఐఏ కోర్టు..దాన్ని తోసిపుచ్చింది. ఈ మేరకు జగన్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది.

vijayawada nia court dismisses ys jagans plea for re-investigation in cock knife case

వైజాగ్ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉండగా 2019లో కోడికత్తి దాడి జరిగింది. ఈ ఘటన జరిగి ఐదేళ్లు కావస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్ఐఏతో తిరిగి దర్యాప్తు చేయించాలన్న వాదనతో ఎన్ఐఏ కోర్టు విభేదించింది. అలాగే కోడికత్తి దాడికి పాల్పడిన జనిపల్లి శ్రీనివాసరావు నేర చరిత్ర తెలియకుండా వైజాగ్ ఎయిర్ పోర్టు క్యాంటీన్ ఓనర్ హర్షవర్ధన్ ఆయన్ను పనిలో పెట్టుకోవడం, 2014లో సదరు హర్షవర్ధన్ గాజువాక టికెట్ కోసం చేసిన ప్రయత్నాల్ని జగన్ లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఎన్ఐఏ మాత్రం ఈ వాదనలతో కోడి కత్తి దాడిలో కుట్ర ఉందని చెప్పలేమని వాదించింది. చివరికి ఎన్ఐఏ వాదనతో కోర్టు ఏకీభవించింది.

మరోవైపు కోడి కత్తి కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టులో హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన మరో పిటిషన్ పై విచారణ ఆగస్టు 1కి వాయిదా పడింది. ముఖ్యమంత్రిగా బిజీగా ఉండే తాను కోర్టు విచారణకు హాజరైతే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని జగన్ ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. కాబట్టి అడ్వకేట్ కమిషనర్ ను నియమించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వాంగ్మూలం నమోదు చేసుకోవాలని జగన్ కోరారు. దీనిపై ఆగస్టు 1 న కోర్టులో వాదనలు ప్రారంభమవుతాయి. అలాగే ఐదేళ్లుగా
జైల్లోనే ఉంటున్న నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్ పైనా అదే రోజు వాదనలు జరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+