వంశీ ఎపిసోడ్ లో కీలక పరిణామం - ఆధారాలు, ఉచ్చు..!!

వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రిమాండ్ లో ఉన్న వంశీని కస్టడీ కోరుతూ కోర్టులో పోలీసులు పిటీషన్ దాఖలు చేసారు. వంశీ అరెస్ట్ పైన రాజకీయంగా విమర్శలు వస్తున్నా.. పూర్తి ఆధారాలతోనే కేసు నమోదైందని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు. జైలులో ఉన్న వంశీని పరామర్శించిన ఆయన సతీమణి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇదే సమయంలో విజయవాడ పోలీసులు వంశీ మొబైల్ తో పాటుగా కొన్ని ఆధారాల కోసం ఆయన నివాసంలో తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని కేసులతో వంశీకి ఉచ్చు బిగించటం ఖాయమనే ప్రచారం సాగుతోంది.

పోలీసుల సోదాలు
వల్లభనేని వంశీ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే రిమాండ్ లో ఉన్న వంశీ పైన మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని వంశీ నివాసం లో మరోసారి సోదాలు నిర్వహించారు. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంట్లో తనిఖీలు కొనసాగు తున్నాయి. వంశీ నివాసంలో పోలీసు అధికారులు ఇంట్లో ఓ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ సోదాలు కొనసాగిస్తున్నారు. వంశీ మొబైల్ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వంశీ మొబైల్‌లో కీలక ఆధారాలు ఉన్నాయని కాప్స్‌ భావిస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీని అధికారులు సేకరించారు.

Vijayawada Police searches in Vallabhaneni Vamsi house for his mobile and important documents

కీలక ఆధారాలు
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి వంశీ ఫోనులో కీలక ఆధారాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. వంశీని అరెస్ట్ చేసే సమయంలో ఆయన ఫోను దొరకటం లేదని చెబుతున్నారు. దీంతో వంశీ మొబైల్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీని కోసం హైదరాబాద్‌కు రెండు దర్యాప్తు బృం దాలు చేరుకున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 94 మంది నిందితులుగా ఉండగా ఇప్పటి వరకు ఏపీ సీఐడీ 40 మందిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ71గా వంశీ ఉన్నారు. మిగిలిన నింది తుల కోసం ప్రత్యేక టీం గాలిస్తోంది. ఇంట్లో కొన్ని డాక్యుమెంట్లను పోలీసులు సేకరించారు. సత్యవర్ధన్‌ ను కిడ్నాప్ చేసిన కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.

వంశీకి మద్దతుగా
సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసుల వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. వంశీకి విజయవాడ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదే సమయంలో పోలీసులు రిమాండ్ పిటీషన్ పై నిర్ణయం రావాల్సి ఉంది. వచ్చే మంగళ వారం మాజీ సీఎం జగన్ జైలులో వంశీని పరామర్శించే అవకాశం ఉందని సమాచారం. ఇటు వంశీ తరపు న్యాయవాదులు మాత్రం అసలు నిబంధనలకు విరుద్దంగా అరెస్ట్ చేసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో తమ వాదనలు వినిపించేందుకు సిద్దం అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+