Pawan Vs Volunteers : పవన్ కల్యాణ్‌‌పై మహిళా వాలంటీర్లు ఫైర్..చెప్పుతో కొట్టి..!

ఏపీలో వాలంటీర్ల వ్యవస్ధను తీసుకొచ్చిన వైసీపీ .. తమకు అనుకూలంగా దాన్ని వాడుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే క్రమంలో వాలంటీర్ల పనితీరుపై గతంలో టీడీపీ విమర్శలు చేయగా.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి ఏలూరులో పలు కీలక వ్యాఖ్యలు చేసారు. వాలంటీర్లు ఒంటరి మహిళల సమాచారం సేకరించి ప్రభుత్వానికి ఇస్తున్నారని, దీంతో వారి కిడ్నాప్ లు జరుగుతున్నాయని పవన్ వ్యాఖ్యానించారు. దీనిపై దుమారం రేగుతోంది.

పవన్ కళ్యాణ్ ఏలూరులో వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై విజయవాడలో వైసీపీ నేతలతో కలిసివారు నిరసనకు దిగారు. పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కి వ్యతిరేకంగా మహిళ వాలంటీర్లు నిరసన చేపట్టారు. పవన్ కళ్యాణ్ చిత్ర పటాన్ని చెప్పులతో కొట్టిన మహిళా వాలంటీర్లు.. చిత్రపటాన్ని కూడా కాల్చి బూడిద చేశారు. వాలంటరీ వ్యవస్థను దూషించిన పవన్ వాలంటరీ లోకానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

 pawan kalyan

వాలంటరీ వ్యవస్థకు జోలికొస్తే తాటతీస్తామని మహిళా వాలంటీర్లు పవన్ ను హెచ్చరించారు. వాలంటీర్ల నిరసనకు విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి మద్దతు తెలిపారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా వీరికి జతకలిశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి.. పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. వాలంటరీ వ్యవస్థ పై పవన్ మాటలు హేయమన్నారు.

ప్రజలకు మేలు చేసే వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ అని వెల్లంపల్లి తెలిపారు. పవన్ కళ్యాణ్ కి లోక జ్ఞానం లేదన్నారు.
మహిళలను హేళన చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. పవన్ కి సిగ్గు శరం లేదని వెల్లంపల్లి అన్నారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ వ్యక్తి అని, అవ్వ తాతలకు సేవ చేసే వ్యక్తులు వాలంటరీలని గుర్తుచేశారు. చంద్రబాబు చెప్పిన మాటలు మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలపై బీజేపీ వాళ్లు సమాధానం చెప్పాలన్నారు. దీంతో ఒకేసారి పవన్, బీజేపీని ఇరుకునపెట్టేందుకు ఆయన ప్రయత్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+