విజయవాడ పశ్చిమ బైపాస్ పై కీలక అప్డేట్..! టోల్ వసూలుపై క్లారిటీ..!
ఏపీలోని విజయవాడ మీదుగా ప్రయాణాలు సాగించే చెన్నై, కోల్ కతా మార్గాల ప్రయాణికుల సౌలభ్యం కోసం నిర్మిస్తున్న పశ్చిమ బైపాస్ పై మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని కాజా నుంచి విజయవాడ ను టచ్ చేయకుండా ఏలూరువైపు రాకపోకలు సాగించే వారి కోసం రోడ్డు అందుబాటులోకి వచ్చేసింది. దీంతో రెండో వైపు అంటే ఏలూరు వైపు నుంచి గుంటూరు వైపుకు ప్రయాణాలు చేసే వారి కోసం రోడ్డు పనులు ఇవాళ మొదలయ్యాయి.
గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కాజా వద్ద పశ్చిమ బైపాస్ రోడ్డు పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇవాళ NHAI ప్రాంతీయ అధికారి ఆర్ కే సింగ్ పూజలు చేసి ఈ పనులు ప్రారంభించారు. మార్చి నాటికి రెండువైపులా రోడ్డును పూర్తిస్ధాయిలో అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. తాత్కాలికంగా కాజా నుంచి ఒకవైపు వాహనాలను అనుమతి ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అదే సమయంలో టోల్ గేట్ ఫీజుల వసూలుపైనా ఆయన క్లారిటీ ఇచ్చేశారు.

విజయవాడ పశ్చిమ బైపాస్ పై రెండు వైపులా పూర్తిస్దాయిలో పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చే వరకూ వాహనదారుల నుంచి టోల్ ఫీజులు వసూలు చేయట్లేదని ఆయన వెల్లడించారు. రెండు వైపులా రోడ్డు అదుబాటులోకి వచ్చాకే టోల్ వసూలు చేస్తామని తెలిపారు. దీంతో ప్రస్తుతానికి గుంటూరు వైపు నుంచి ఏలూరు వైపుకు ప్రయాణాలు సాగించేందుకు అందుబాటులోకి వచ్చిన రోడ్డుపై వెళ్లే వారికి దీంతో ప్రయోజనం చేకూరబోతోంది. అలాగే మార్చిలో రెండో వైపు రోడ్డు అందుబాటులోకి వచ్చే వరకూ ఆ రోడ్డుపైనా టోల్ ఫీజు బాధలు ఉండవు.












Click it and Unblock the Notifications