వైసీపీలో నెంబర్ టు ఎవరు : సాయిరెడ్డి- సజ్జలలో ఎవరిది ఏ స్థానం : జగన్ మార్క్ డెసిషన్స్..!!

సీఎం జగన్ పార్టీ అధినేతగా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో ఆయన కొత్తగా అప్పగిస్తున్న బాధ్యతలు..ఎంపిక చేస్తున్న విధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. 2024 ఎన్నికల్లో తన సైన్యాన్ని సిద్దం చేసుకుంటున్న జగన్ ప్రభుత్వంలో మంత్రులు - ఇన్ ఛార్జ్ మంత్రుల ప్రక్రియ పూర్తి చేసారు. ఇక, పార్టీలోనూ కీలక బాధ్యతలను నేతలకు అప్పగిస్తూ నిర్ణయించారు. పార్టీ ఏర్పాటు నుంచి జగన్ తోనే ఉంటూ...పార్టీలో నెంబర్ టు స్థానం విజయ సాయిరెడ్డి దేనని ప్రచారం సాగేది. పార్టీలో ఆయన మాటకు తిరుగు లేదు. జగన్ తరువాత అంతటి హోదా..అధికారం ఆయన పార్టీలో అనుభవించారు. ఇక, పార్టీ ఏర్పాటు తరువాత రాజ్యసభ సభ్యుడిగా అటు కేంద్రం..ఇటు వైసీపీ, ఆ తరువాత కేంద్రం - ఏపీ మధ్య సంథాన కర్తగా వ్యవహించారు.

తొలి నుండీ జగన్ తరువాతి స్థానంలో

తొలి నుండీ జగన్ తరువాతి స్థానంలో

2019 ఎన్నికల్లో ఢిల్లీలో క్రియాశీలకంగా పని చేసారు. అదే సమయంలో రాష్ట్రంలో వైసీపీ విజయంలోనూ కీలక భూమిక పోషించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సైతం చాలా అన్నీ తానై వ్యవహరించారు. ఇక్కడ పార్టీలో జగన్ వద్ద..అటు కేంద్రంలో ప్రధాని వద్ద మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇదే నమ్మకంతో జగన్ విశాఖతో పాటుగా ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ గా సాయిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల సమయంలో ఆ జిల్లాలో పార్టీ గెలుపులో ప్రతీ నిర్ణయంలోనూ ఆయనదే ప్రధాన పాత్ర. కానీ, అనేక ఆరోపణలు సాయిరెడ్డి ఎదుర్కొన్నారు. ఇక, ఇప్పుడు బాధ్యతలు మారాయి. విశాఖతో పాటుగా ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించారు. ఆ స్థానంలో వైవీ సుబ్బారెడ్డి - బొత్సాకు ఆ బాధ్యతలు కేటాయించారు.

క్రమేణా పట్టు పెరిగిన సజ్జల

క్రమేణా పట్టు పెరిగిన సజ్జల

ఇక, ఇదే సమయంలో పార్టీలో సజ్జల క్రియాశీలకంగా మారారు. జగన్ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక విధంగా.. అటు పార్టీలో - ఇటు ప్రభుత్వం లో సూప‌ర్ ప‌వ‌ర్ గా వ్యవహరిస్తున్నారు. సాయిరెడ్డికి పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్ గా వ్యవహరించనున్నారు. ఇది ఒక విధంగా ఆయనకు ప్రాధాన్యత తగ్గించటమే అనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. కానీ, ఎన్నికల సమయంలో అనుబంధ విభాగాలు కీలక పాత్ర పోషించేలా చూడటం కోసమే సాయిరెడ్డికి ఆ బాధ్యత ఇచ్చారనేది మరో వాదన. సజ్జలకు కర్నూలు బాధ్యతలు కేటాయించారు. ఇదే సమయంలో కీలకమైన అన్ని జిల్లాల ప్రాంతీయ సమ‌న్వ‌య‌క‌ర్త‌ల స‌మ‌న్వ‌య బాధ్య‌తలను అప్పగించారు. ఇది ఒక రకంగా పార్టీలో జగన్ తరువాత పార్టీని కంట్రోల్ చేసే అధికారం సజ్జలకు ఇవ్వటమేననే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఇక, తాజాగా మంత్రివర్గ కూర్పు విషయంలోనూ సీఎం జగన్ ..సజ్జల మినహా మరెవరికీ అవకాశం ఇవ్వలేదు. అలక బూనిని వారిని బుజ్జగించటం.. పార్టీ - ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాల ప్రకటన అన్నీ..సజ్జల తానై వ్యవహరిస్తున్నారు.

పార్టీ - ప్రభుత్వంలో కీ రోల్

పార్టీ - ప్రభుత్వంలో కీ రోల్

ఒక విధంగా సజ్జల నోటి నుంచి వచ్చే మాట..జగన్ మాట అనే స్థాయిలో పార్టీలో ప్రాధాన్యత పెరిగింది. సాయిరెడ్డి పూర్తిగా ఇప్పుడు ఢిల్లీ వ్యవహారాలు - అనుబంధ సంఘాలతో సమావేశాలు.. జాబ్ క్యాంపుల నిర్వహణ పైనే ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్షాల పైన విమర్శలు చేస్తూ... జగన్ నిర్ణయాలను ప్రశంసిస్తున్నారు. అయితే, సాయిరెడ్డి రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. నాలుగు స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి. సాయిరెడ్డికి రెన్యువల్ ఖాయమని చెబుతున్నారు. ఢిల్లీలో మాత్రం సాయిరెడ్డిని డామినేట్ చేసి బాధ్యతలు తీసుకొనే స్థాయిలో పార్టీలో మరెవరూ కనిపించటం లేదు.

తాజా నిర్ణయాలతో..పార్టీలో ఉత్కంఠ

తాజా నిర్ణయాలతో..పార్టీలో ఉత్కంఠ

కానీ, సాయిరెడ్డి ప్రాధాన్యత ఎందుకు దక్కుతోందనేది మాత్రం పార్టీలో ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న సాయిరెడ్డికి సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించి..అదే సమయంలో లోక్ సభలో పార్టీ నేతగా ఉన్న మిథున్ రెడ్డికి సమన్వయ కర్తగా బాధ్యతలు అప్పగించారు. దీంతో..వైసీపీలో నెంబర్ టు స్థానం టు స్థానం ఇప్పుడు ఎవరిది అంటే..దాదాపుగా సజ్జల పేరు వినిపించే విధంగా..ఆయన యాక్టివ్ అయ్యారు. దీంతో..సీఎం జగన్ తాజా నిర్ణయాలు రానున్న రోజుల్లో ఎటువంటి మలుపులకు కారణం అవుతాయనే ఆసక్తి పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+