వినాయక చవితి: చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ సంచలన పోస్ట్; భువనేశ్వరి పూజలు!!
టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయ్యి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు పై అక్రమ కేసులు బనాయించారని, కక్ష సాధింపు చర్యలలో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో వైసిపి ప్రభుత్వం పై మండిపడుతున్నారు.
చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా వినాయక చవితి పండుగ రోజు అసలు ఊహకే అందని విధంగా చంద్రబాబు జైలు పాలు కావటంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. నేడు గణేశ చతుర్థి సందర్భంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాజమండ్రిలోని నాళం భీమరాజు వీధిలోని వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్టుపై వినాయక చవితి సందర్భంగా తెలుగుదేశం పార్టీ సంచలన ట్వీట్ చేసింది. చంద్రబాబు నీలాప నిందలను అనుభవిస్తున్నారని పేర్కొంది. అలనాడు శ్రీకృష్ణుడు శమంతక మణి దొంగిలించాడని నీలాపనిందలు ఎదుర్కొన్నాడు అని వినాయక వ్రతకల్పం వల్ల నిర్దోషిగా నిరూపించబడ్డాడు అని, నేడు చంద్రబాబు పై ఉన్న నిందలు కూడా తొలగిపోవాలని కోరుకుంది.
అలనాడు శ్రీకృష్ణుడు శమంతకమణి దొంగిలించాడని నీలాప నిందలు ఎదుర్కొన్నాడు. శ్రీ వినాయక వ్రతకల్పం వల్ల నిర్దోషిగా నిరూపించబడ్డాడు.
— Telugu Desam Party (@JaiTDP) September 18, 2023
నేడు చంద్రబాబు గారు ఎదుర్కొంటున్న నిందలు కూడా తొలిగిపోయి, శ్రీ వినాయక స్వామి చల్లని చూపులతో నిర్దోషిగా నిరూపితం అవ్వాలని కోరుకుందాం.#TDPJSPTogether… pic.twitter.com/a1Gp5XzPm8
వినాయక స్వామి చల్లని చూపులతో నిర్దోషిగా నిరూపితం అవ్వాలని కోరుకుందాం అని తెలుగుదేశం పార్టీ అధికారికి ట్విట్టర్ ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టింది. శ్రీకృష్ణుడికే తప్పని నీలాపనిందలు, ఇప్పుడు చంద్రబాబుకు కూడా తప్పడం లేదని పేర్కొంది. అప్పుడు శ్రీకృష్ణుడు వినాయకుడి మహిమతో ఎలా అయితే నీలాప నిందల నుండి బయటకు వచ్చాడో అలాగే చంద్రబాబు బయటకు రావాలని ఆకాక్షించింది.
ప్రస్తుతం చంద్రబాబు కూడా అపవాదు నుండి నిర్దోషిగా, దుష్ట పరిపాలకుల కుట్రల నుంచి బయటకు రావాలని మనమందరం విఘ్న నాధుడుని కోరుకుందాం అని, చంద్రబాబు బయటకు రావాలని ఆకాంక్షిస్తూ వినాయక చవితికి పోస్టు పెట్టింది టిడిపి. మరి టీడీపీ కోరిక తీరుతుందా లేదా అన్నది భవిష్యత్ లో తేలనుంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications