Viral video: షాక్‌లో ఫ్యాన్స్: మహేష్ బాబు కోసం ప్రత్యేక పూజలు..హోమాలు
అమరావతి/హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు కరోనా వైరస్ బారిన పడ్డారనే సమాచారం.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. కోట్లాదిమంది ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయనకు ఎలాంటి ఆపద రాకూడదంటూ ప్రార్థనలు చేస్తోన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలంటూ పూజలు చేస్తోన్నారు. ఒకట్రెండు చోట్ల హోమాలను సైతం నిర్వహించారు అభిమానులు.

హోమ్ ఐసొలేషన్‌లో..
మహేష్ బాబు కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేశారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు కరోనా వైరస్ సోకిందని, లక్షణాలు స్వయంగానే ఉన్నాయని చెప్పారు. కోవిడ్ సోకిన విషయం తెలిసిన వెంటనే తాను హోమ్ ఐసొలేషన్‌లోకి వెళ్లానని వివరించారు. ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారందరూ తప్పనిసరిగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని సూచించారు.
సూపర్ స్టార్ కోలుకోవాలంటూ..
కరోనా వైరస్ సోకడం వల్ల సంభవించే దుష్ప్రభావాన్ని వ్యాక్సిన్ తగ్గిస్తుందని, అందుకే- ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాము ఆరాధించే, అభిమానించే సూపర్ స్టార్ కోవిడ్ బారిన పడటం వల్ల కోట్లాదిమంది అభిమానులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోన్నారు. #MaheshBabu, #GetWellSoonSuperStar అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. వేలకొద్దీ పోస్టులు సోషల్ మీడియాలో పడుతున్నాయి.

మహేష్ పేరు మీద
ఈ తెల్లవారు జాము నుంచి ఆలయాల్లో మహేష్ బాబు పేరు మీద అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తోన్నారు. ఒకట్రెండు చోట్ల హోమాలను సైతం నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా దాకా సూపర్ స్టార్ కృష్ణ-మహేష్‌బాబు అభిమాన సంఘాల ప్రతినిధులు పలు చోట్ల ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఇళ్లల్లోనూ పూజలు చేశారు. దేవుళ్ల పటాల వద్ద మహేష్ బాబు ఫొటోలను ఉంచి ప్రార్థనలు చేశారు. గెట్ వెల్ సూన్ అంటూ బ్యానర్లను ప్రదర్శించారు.

సంపూర్ణ ఆరోగ్యంతో..
మహేష్ బాబు త్వరగా కోలుకోవాలని ఆయన పేరు మీద అర్చనలు చేయించామని మహేష్ బాబు అభిమాన సంఘాల ప్రతినిధులు తెలిపారు. తమ ఆరాధ్య దైవం మహేష్ బాబు త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని, తమ ముందుకు వస్తారని అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలి విజ్ఞప్తి చేశారు. మాస్కులు ధరించాలని, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో..
ఇదివరకు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సైతం కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. సెకెండ్ వేవ్ సమయంలో అటు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్‌లల్లో పలువురు సెలెబ్రిటీలు కోవిడ్‌కు గురయ్యారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వంటి పలువురు నటులకు కరోనా వైరస్ సోకింది. ఇప్పుడు కూడా జాన్ అబ్రహం, ఆయన భార్య, కరీనా కపూర్, అమృత అరోరా కోవిడ్ పాజిటివ్‌గా తేలారు. కరీనా కపూర్, అమృత అరోరా కోవిడ్ నుంచి కోలుకున్నారు. జాన్ అబ్రహం ఆయన భార్య హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారు.












Click it and Unblock the Notifications