విశాఖలో నిత్య పెళ్ళికొడుకు .. 8 మందితో ప్రేమపెళ్ళి , ఆపై వ్యభిచార రొంపిలోకి
విశాఖపట్నంలో ఓ నిత్య పెళ్ళికొడుకు వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని, కొన్నాళ్ళు వారిపై కోరిక తీర్చుకుని, ఆపై వ్యభిచార కూపంలోకి నెడుతున్న మోసకారి అయిన యువకుడి గుట్టురట్టయింది .

విశాఖలో నిత్య పెళ్ళికొడుకు అరాచకాలు .. ప్రేమపెళ్ళితో మోసం .. ఆపై
విశాఖలో ఓ నిత్య పెళ్ళికొడుకు అరాచకాలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్న అరుణ్ కుమార్ అనే వ్యక్తి వేధింపులు భరించలేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అరుణ్ కుమార్ అనే మోసగాడు ప్రేమ పెళ్లి పేరుతో అమ్మాయిలను మోసం చేయడమే కాకుండా, పెళ్లి చేసుకున్న తర్వాత వారిని నానా విధాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. అందంగా ఉన్న అమ్మాయిలను చూసి వలవేసి వారి వెనక తిరగడం, వారిని ఎలాగైనా తన ట్రాప్ లోకి తెచ్చుకోవడం, ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవడం, కొన్నాళ్లు మోజు తీర్చుకోవడం ఆపై వారిని వ్యభిచార కూపంలోకి నెట్టడం పనిగా పెట్టుకున్నాడు.

గంజాయి గ్యాంగ్ లతో పాటు వ్యభిచార ముఠాలతో సంబంధాలు
గతంలో గంజాయి దందా సాగించిన ఇతనిపై పలు కేసులు కూడా ఉన్నాయి . గంజాయి ముఠా తో పాటు , వ్యభిచార ముఠా తో కూడా సంబంధాలు పెట్టుకున్న అరుణ్ కుమార్ తాను పెళ్లి చేసుకున్న భార్యలను వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చాడు. భార్యలను మాత్రమే కాకుండా , మొదటి భార్య కుమార్తెను వ్యభిచార ముఠాకు అమ్ముతా అంటూ వేధింపులకు గురి చేసి, తన మాట వినకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు . ఎక్కడ ఏ కొత్త మారణాయుధం వాడినా, సినిమాలలో వేటిని చూసినా అటువంటి మారణాయుధాలను తయారు చేయించుకుని బెదిరించడం అరుణ్ కుమార్ కు అలవాటు.

వేధింపులు భరించలేక పోలీసులను, మహిళా సంఘాలను ఆశ్రయించిన బాధిత మహిళలు
అరుణ్ కుమార్ వేధింపులతో విసిగిపోయిన మొదటి భార్య గీతాంజలి, రెండో భార్య లక్ష్మి భర్త ఆగడాలు భరించలేక కంచరపాలెం పోలీసులను ఆశ్రయించారు . అయితే స్థానిక పోలీసులకు, అరుణ్ కుమార్ కు సంబంధం ఉన్న నేపథ్యంలో బాధితులు ఫిర్యాదు చేసిన అరుణ్ కుమార్ పై చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తూ తమకు న్యాయం చెయ్యాలని మహిళా సంఘాలను ఆశ్రయించారు. దీంతో మహిళా సంఘాలు ఈ విషయాన్ని సిపి మనీష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు.

సీపీకి ఫిర్యాదు .. మోసకారి అరెస్ట్ .. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తనకు ప్రాణహాని ఉందని తక్షణమే అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేయాలని సి పి మనీష్ కుమార్ కు బాధితులు వాయిస్ మెసేజ్ పెట్టారు.దీనిపై స్పందించిన సిపి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. అరుణ్ కుమార్ వద్ద ఉన్న మారణాయుధాలను స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాకుండా అతని ఆగడాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications