ఉద్యోగాలేవి: విప్రోపై విశాఖ ఎమ్మెల్యేల ఫైర్ (ఫొటోలు)
విశాఖపట్నం: సాఫ్ట్‌వేర్ రంగంలోని దిగ్గజం విప్రో సంస్థపై విశాఖపట్నం జిల్లాకు చెందిన తెలుగుదేశం, బిజెపి శాసనసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థలు ఏర్పాటు చేసుకుంటారు, ఉద్యోగాలిమ్మంటే కుదరదంటారని వారు నిలదీశారు.
విలువైన భూములు సొంతం చేసుకోవడం మినహా యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో మాత్రం ముందుకు రావడం లేదంటూ వారు విప్రో సంస్థపై మండిపడ్డారు. విప్రో సంస్థ జనరల్ మేనేజర్ విజయ్ అగర్వాల్‌ను మంగళవారం కలిసిన టిడిపి, బిజెపి ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, పల్లా శ్రీనువాస్, వాసుపల్లి గణేష్‌కుమార్, విష్ణుకుమార్ రాజు తదితరులు సంస్థ తీరుపై మండిపడ్డారు.
నగరం నడిబొడ్డున కోట్ల విలువైన భూములు తీసుకుని సంస్థను ప్రారంభించిన విప్రో యాజమాన్యం 2000 ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకుని కేవలం 650 మందికి మాత్రమే అవకాశం ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎపిఐఐసి నోటీసులిచ్చినా స్పందించకపోవడంపై మండిపడ్డారు. దీనిపై సంస్థ జిఎం అగర్వాల్ వివరణ నిచ్చేందుకు ప్రయత్నించారు. తమకు ప్రత్యేక ఆర్థిక మండలి హోదా కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు.

విఫ్రోపై మండిపాటు
విప్రోపైనే కాకుండా టెక్ మహేంద్రాపై కూడా విశాఖపట్నం జిల్లాకు చెందిన నలుగురు శాసనశభ్యులు తీవ్రంగా ధ్వజమెత్తారు.

విప్రోపై మండిపాటు
సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీలపై విశాఖపట్నం ఉత్తరం శాసనసభ్యుడు పి. విష్ణుకుమార్ రాజు, పరవాడ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, విశాఖ దక్షిణం శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్, గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్ ధ్వజమెత్తారు.

విప్రోపై మండిపాటు
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం నాగేంద్రతో పాటు శాసనసభ్యులు ఎపిఐఐసి అధికారులతో కలిసి మంగళవారం ఉదయం విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలను మంగళవారం ఉదయం సందర్శించారు.

విప్రోపై మండిపాటు
విప్రో కంపెనీ 7.14 ఎకరాల భూమిని తీసుకుందని, రెండు వేల మందికి ఉపాధి కల్పించాల్సి ఉండగా ఎనిమిదేళ్లయినా ఆ హామీని నెరవేర్చలేదని శాసనసభ్యులు విమర్శించారు.

విప్రోపై మండిపాటు
కేవలం 3 ఎకరాల్లో భవనం నిర్మించి 680 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని అంటూ మిగిలినవారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని శాసనసభ్యులు డిమాండ్ చేసారు.

విప్రోపై మండిపాటు
మిగిలిన నాలుగు ఎకరాల్లో సెజ్ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వ అనుమతి కోరామని, దానికి అనుమతి వస్తే రాబోయే ఐదేళ్లలో ఏడు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని విప్రో ప్రతినిధులు చెప్పారు.

విప్రోపై మండిపాటు
విప్రో ప్రతినిధుల వాదనలను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యతిరేకించారు. ఎంకరం రూ.50 లక్షల చొప్పున తీసుకున్నారని, ఇప్పుడు రూ.50 కోట్లకు చేరిందని, దాదాపు రూ.200 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని వృధాగా వదిలేశారని ఆయన అన్నారు.

విప్రోపై మండిపాటు
వృధా వదలేసిన రూ. 200 కోట్ల రూపాయల విలువ చేసే విప్రో భూమిని వెనక్కి తీసుకోవాలని విష్ణుకుమార్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విప్రోపై మండిపాటు
సెజ్ కోసం ఏ మధురవాడో, కాపులుప్పాడలో స్థలమో కేటాయించాలని శానససభ్యుడు విష్ణు కుమార్ రాజు సూచించారు.

టెక్ మహీంద్రాలో..
శాసనసభ్యులు, బిజెపి నాయడు విప్రోను సందర్శించిన తర్వాత టెక్ మహీంద్రా కంపెనీని సందర్శించారు. అక్కడి పరిస్థితిని పరిశీలించారు.

టెక్ మహీంద్రా కూడా..
నిబంధనల ప్రకారం టెక్ మహీంద్రా రెండు వేల మందికి ఉపాధి కల్పించాల్సి ఉండగా, వేయి మందికి మాత్రమే ఉపాధి కల్పించిందని శాసనసభ్యులు తప్పు పట్టారు.

టెక్ మహీంద్రాలో..
కొద్ది కాలం క్రితం వరకు బిపివో నడిపామని, పాలసీ ప్రకారం దాన్ని ఎత్తేయడంతో ఉద్యోగుల సంఖ్య తగ్గిందని టెక్ మహీంద్రా కంపెనీ ప్రతినిధులు చెప్పారు.

టెక్ మహీంద్రాలో
కొత్తగా అదే ప్రాంగణంలో మరో భవనం నిర్మిస్తున్నామని, అది పూర్తి కాగానే 500 మందిని తీసుకుంటామని టెక్ మహీంద్రా ప్రతినిధులు చెప్పారు.

టెక్ మహీంద్రాలో..
ఆ తర్వాత మరో 1500 మందికి ఉపాధికి ఉపాధి కల్పిస్తామని, వాటిలో 85 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని టెక్ మహీంద్ర ప్రతినిధులు చెప్పారు.

ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు..
ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలను వేధించే విధంగా వారి వ్యవహారం ఉందని అంటున్నారు.

ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు..
కంపెనీలు ఉపాధి కల్పించకపోతే కలెక్టర్, మంత్రి సారథ్యంలో సమావేశం ఏర్పాటు చేసి కంపెనీ ప్రతినిధులను పిలిచి మాట్లాడాలి గానీ ఆయా ప్రాంగణాల్లోకి వెళ్లి హడావిడి చేయడం సరి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications