విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ నాట్ ఫర్ సేల్ : బీజేపీ నిరసన; జగన్ పై మండిపడిన మాధవ్, విష్ణు కుమార్ రాజు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. తాజాగా వైజాగ్ లోని ప్రభుత్వ ఆస్తులను వివిధ బ్యాంకులకు తనఖా పెట్టి అప్పులు చేస్తున్న ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వ భవనాలు తనఖా పెట్టడాన్ని నిరసిస్తూ మహాధర్నా చేపట్టారు బిజెపి నాయకులు. విశాఖ నాట్ ఫర్ సేల్ అంటూ బిజెపి నేతలు ధ్వజమెత్తారు.

దశల వారీగా విశాఖ ఆస్తుల తాకట్టు .. బీజేపీ విష్ణుకుమార్ రాజు ఎద్దేవా

దశల వారీగా విశాఖ ఆస్తుల తాకట్టు .. బీజేపీ విష్ణుకుమార్ రాజు ఎద్దేవా

బీజేపీ నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి సంక్షేమ పథకాల కోసం ఆ అప్పులను వాడటం దారుణమని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. మొదటి దశలో 13రకాల ఆస్తులను తాకట్టు పెట్టారని, రెండో దశలో కలెక్టరేట్ తో పాటుగా మిగిలిన పదకొండు ఆస్తులను కూడా తాకట్టు పెడతారని ఆరోపించారు.ఇక మూడో దశలో ప్రభుత్వ ఆసుపత్రులైన కేజీహెచ్, విమ్స్, ఘోష ఆసుపత్రులను తాకట్టు పెడతారని, విశాఖ బీచ్, కైలాసగిరి కూడా కుదువ పెట్టేస్తారేమోనని ఎద్దేవా చేశారు.

 ప్రభుత్వ ఆస్తులు కుదువ పెట్టుకునే బ్యాంకులపై సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలి

ప్రభుత్వ ఆస్తులు కుదువ పెట్టుకునే బ్యాంకులపై సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలి


సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్న విష్ణుకుమార్ రాజు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టే బదులు, జగన్ భారతి సిమెంట్ ను, ఇడుపులపాయ ఎస్టేట్ ను, బెంగళూరు భారీ భవంతిని, హైదరాబాద్లోని లోటస్ పాండ్ ను తాకట్టు పెట్టొచ్చు కదా అంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టుకున్న బ్యాంకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టుకునే అప్పులు ఇస్తున్న బ్యాంకుల పైన సిబిఐ ఎంక్వయిరీ చెయ్యాలని కేంద్రాన్ని కోరుతున్నామని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.

 ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టటం రాజ్యాంగ విరుద్ధం :బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టటం రాజ్యాంగ విరుద్ధం :బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్


బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నం నాట్ ఫర్ సేల్ అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలి అని చెప్పిన మాధవ్, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి వైసీపీ సర్కార్ కనికట్టు చేస్తుందని ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్న సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 విశాఖలో 13 ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన జగన్ సర్కార్ .. ప్రతిపక్షాల ధ్వజం

విశాఖలో 13 ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన జగన్ సర్కార్ .. ప్రతిపక్షాల ధ్వజం


ఇదిలా ఉంటే అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడిపేందుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అందులో భాగంగా రాష్ట్ర వాణిజ్య రాజధాని విశాఖలోని 2,954 కోట్ల మార్కెట్ విలువ ఉన్న ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టింది.విశాఖ లోని మొత్తం 13 ఆస్తులుగా ఉన్న 128.70 ఎకరాలను ఎస్బిఐ క్యాప్ ట్రస్ట్ కంపెనీకి తాకట్టు పెట్టింది . ఈ మేరకు తాకట్టు రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసింది. ప్రభుత్వం తాకట్టు పెట్టిన భూముల్లో అనేక ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ ఆస్తులను వైసీపీ ప్రభుత్వం తనఖా పెట్టడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

విశాఖలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపై టీడీపీ నేత అయ్యన్న ఆగ్రహం

విశాఖలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపై టీడీపీ నేత అయ్యన్న ఆగ్రహం


ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం ముమ్మాటికీ తుగ్లక్ నిర్ణయం అంటూ వైసీపీ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. అసలు ప్రజల ఆస్తులను తనఖా పెట్టడానికి వీళ్లకు ఉన్న అధికారం ఏంటి? అంటూ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు .ఇప్పటికే ఏ 2 విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో విలువైన ఆస్తులను దోచుకున్నారని, ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ ఐటిఐ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, సర్క్యూట్ హౌస్, తహసిల్దార్ కార్యాలయం, పోలీస్ క్వార్టర్స్ ఇలా 13 విలువైన ప్రజల ఆస్తులను తనఖా పెట్టారని ద్వజమెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉన్న అన్ని పార్టీల నాయకులు ఈ తుగ్లక్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తి చేశారు.

English summary
BJP leaders staged a mahadharna at the GVMC Gandhi statue to protest on mortgage of government properties in visakha. BJP leaders raise the concern that Visakhapatnam is not for sale. Madhav and Vishnukumar Raju targeted and criticized Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X