మహిళపై యాసిడ్ దాడి: వివాహేతర సంబంధమేనా?

విశాఖపట్నం/మహబూబ్‌నగర్: విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో ఓ వివాహితపై యాసిడ్ దాడి జరిగింది. గురువారం ఉదయం గోలుగొండ మండలం ఎస్సీ కాలనీకి చెందిన వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్‌తో దాడి చేసి పరారయ్యాడు. యాసిడ్ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆమెను కెజిహెచ్‌కు తరలించారు. మహిళ శరీరం 80శాతం కాలిపోవడంతో పరిస్థితి విషమంగా మారింది.

కుటుంబ కలహాల కారణంగా బాధితురాలికి మామ వరస అయిన వ్యక్తే ఈ దాడికి పాల్పడి ఉంటాడని బాధితురాలి తరపు బందువులు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసున్నట్లు తెలిసింది.

Visakhapatnam: Married woman attacked with acid

కాగా, పదేళ్లుగా భర్త నుంచి వేరుగా ఉంటున్న బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారని స్థానికులు చెప్పారు.
ఆమె అర్జున్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించిందని తెలిపారు. కొన్ని రోజులుగా వారి మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో కలుసుకోవడం లేదని, ఈ నేపథ్యంలోనే అతడే దాడి చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.

వ్యక్తి దారుణ హత్య

మహబూబ్‌నగర్: జిల్లాలోని కొత్తూరు మండల పరిధిలోని రంగాపూర్ పంచాయతీ తాటిగడ్డతండాలో ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. తాటిగడ్డతండాలో ఇరుబయట నిద్రిస్తున్న కిషన్ నాయక్(50)ను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి, గొంతుకోసి హత్య చేశారు.

గ్రామ సమీపంలో నూతనంగా నిర్మితమవుతున్న ఓ భవనం సంపులో కిషన్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు గురువారం ఉదయం పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+