ఢిల్లీకి తాకిన నిరసనల సెగ .. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక ఆందోళనపై అడుగడుగునా నిఘా !!
దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా విశాఖ ఉక్కు కార్మిక పోరాటం కొనసాగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు, రేపు ఢిల్లీ కేంద్రంగా ఆందోళన కొనసాగించాలని నిర్ణయించిన విశాఖ ఉక్కు పోరాట సమితి నేతలు, వేలాది కార్మికులతో కలిసి ఢిల్లీ చేరుకుని ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. జంతర్ మంతర్ వద్ద రెండు రోజులపాటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, తమ ఆవేదనను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపధ్యంలో తమ గళాన్ని చట్టసభ్యులకు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు..

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను అడుగడుగునా అడ్డుకుంటున్న ఢిల్లీ పోలీసులు
ఆందోళనలో భాగంగా ఢిల్లీ వెళ్ళిన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను ఢిల్లీలో పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఏపీ నుండి వచ్చిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై ఢిల్లీ పోలీసులు నిఘా పెట్టారు. న్యూ రైల్వే స్టేషన్ దగ్గర స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు రెండున్నర గంటల పాటు వారిని నిర్బంధించారు. అంతేకాదు ఆందోళన చేయడానికి వచ్చిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఎవరు హోటల్ గదులు అద్దెకు ఇవ్వకూడదని స్థానిక హోటల్స్ పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. రైతులకు మద్దతుగా ఢిల్లీకి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వచ్చినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

జంతర్ మంతర్ వద్ద, ఏపీ, తెలంగాణా భవన్ ల వద్ద ఆందోళనలో విశాఖ ఉక్కు కార్మిక లోకం
ఢిల్లీ పోలీసుల తీరుపై విపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు, కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్నామని చెప్తున్నా సరే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం అన్యాయం అంటూ కార్మికులు నినాదాలు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనుల కేటాయింపు జరిపి కేంద్రం సహకరిస్తే లాభాల బాటలో విశాఖ స్టీల్ ప్లాంట్ పయనిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జంతర్ మంతర్ వద్ద, ఏపీ, తెలంగాణా భవన్ ల వద్ద ఆందోళనలో విశాఖ ఉక్కు కార్మిక లోకం
ఢిల్లీ పోలీసుల తీరుపై విపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు, కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్నామని చెప్తున్నా సరే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం అన్యాయం అంటూ కార్మికులు నినాదాలు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనుల కేటాయింపు జరిపి కేంద్రం సహకరిస్తే లాభాల బాటలో విశాఖ స్టీల్ ప్లాంట్ పయనిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దేశ రాజధాని వేదికగా కేంద్రానికి నిరసనల సెగ
స్టీల్ ప్లాంట్ అప్పులను ఈక్విటీలుగా మార్చాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
రెండు రోజుల పాటు ఢిల్లీలో ఆందోళనలు కొనసాగించనున్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల ఆందోళనపై నిఘా పెట్టిన ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీ చేరుకున్న వేలాది కార్మికుల ఆందోళనతో దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్రానికి నిరసనల సెగ తగులుతోంది.
Recommended Video

పోలీసుల తీరుపై ఆగ్రహం .. పోరాటం అణచివేసే కుట్రలపై ఉక్కు కార్మికుల ధ్వజం
అడుగడుగునా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు, కార్మికులకు ఆటంకాలు కలిగిస్తున్న పోలీసుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పోరాటాన్ని అణచివెయ్యటానికి ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా, ఎన్ని కుట్రలు చేసినా ఆందోళన చేసి తీరుతామని అంటున్నారు. కేంద్రం దిగి వచ్చే వరకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పై మనసు మార్చుకునే వరకు పోరుబాట వీడేది లేదని విశాఖ ఉక్కు పోరాట సమితి నేతలు తేల్చి చెప్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications