Vizag CII Summit: ఏపీకి యూరప్ పెట్టుబడులు- చంద్రబాబు బంపర్ ఆఫర్స్..!

ఏపీలో వాణిజ్య రాజధాని విశాఖపట్నంలో రేపు, ఎల్లుండి జరిగే సీఐఐ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సదస్సు ద్వారా లక్ష కోట్ల పెట్టుబడుల్ని రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు సర్కార్.. అంతకు ముందే యూరప్ పెట్టుబడిదారులతో భేటీ అయింది. ఇవాళ ఉదయం విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన యూరప్ పారిశ్రామికవేత్తల భేటీలో చంద్రబాబు వారికి ఏపీ గురించి వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరారు.

విశాఖలో జరిగిన ఇండియా-యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం సుస్థిరాభివృద్ధిలో ఇరుదేశాల మధ్య సహకార భాగస్వామ్యంపై చర్చించింది. ఈ సమావేశానికి హాజరైన అర్మేనియా ఆర్ధిక వ్యవహారాల మంత్రి, భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ అమిత్ కల్యాణి సహా వేర్వేరు కంపెనీల చైర్మన్లు, సీఈఓలు, సీఐఐ ప్రతినిధులతో చంద్రబాబు చర్చించారు. విశాఖ అద్భుతమైన సాగర తీర నగరం, మంచి వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయని వారికి తెలిపారు. అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను విశాఖలోనే ఏర్పాటు చేస్తోందని, సబ్ సీ కేబుల్ కూడా ఈ ప్రాంతం నుంచే ఏర్పాటు అవుతోందని తెలిపారు.

Vizag CII Summit CM Chandrababu Seeks European Investment for Andhra Pradesh

గతంలో ఏపీలో ఐటీని ప్రోత్సహించామని, గూగుల్, ఆడోబ్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థల సీఈఓలు భారతీయులే ఉన్నారని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆర్ధిక సంస్కరణల తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయన్నారు.
జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని, వాటికి అనుగుణంగా సంపద పెరగాల్సి ఉందన్నారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రకాల పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా భారత్ క్వాంటం మిషన్ ప్రారంభించిందని పేర్కొన్నారు. దానిని అందిపుచ్చుకుని తొలి క్వాంటం వ్యాలీని ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Vizag CII Summit CM Chandrababu Seeks European Investment for Andhra Pradesh

అలాగే డ్రోన్లు కూడా పెద్దఎత్తున వినియోగంలోకి తెస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. సివిల్ అప్లికేషన్లు, డిఫెన్సు రంగాల్లో వీటి తయారీ పెరగాలని, అందుకే ఏపీలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయాలని నిర్ణయించామన్నారు. స్పేస్ అప్లికేషన్లు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయని, అందుకే స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ప్రాధాన్యం కూడా గణనీయంగా పెరిగిందని, సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో బలంగా ఉన్నామని గుర్తుచేసారు. అలాగే పోర్టు రవాణా రంగంలో ఏపీలో పెద్దఎత్తున పోర్టులను నిర్మిస్తున్నట్లు వివరించారు.

రైల్వే నెట్ వర్క్ కూడా పోర్టులు, ఎయిర్ పోర్టులు, దేశంలోని వివిధ నగరాల్ని అనుసంధానం చేస్తోందని సీఎం తెలిపారు.
గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందులో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేసి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నామన్నారు. కేవలం 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. గూగుల్ కూడా రెండు మూడు రోజుల్లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించబోతోందన్నారు. వారికి కూడా చాలా కొద్ది రోజుల్లోనే అనుమతులిచ్చామన్నారు.

Vizag CII Summit CM Chandrababu Seeks European Investment for Andhra Pradesh

ప్రోత్సాహకాలు, వేగంగా అనుమతులు ఇవ్వటంలో ఏపీకి పోటీ లేదని చంద్రబాబు గుర్తుచేశారు. పెట్టుబడులతో ముందుకు వస్తే చాలు ఎస్కార్ట్ ఆఫీసర్‌ను నియమించి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా సహకరిస్తామన్నారు. ప్రపంచ మార్కెట్‌లో ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ గేట్ వే గా ఉంటుందన్నారు. ఏపీలో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, పారిశ్రామిక ఉత్పత్తులు, విద్య, వైద్యం, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి సాటి లేదన్నారు. వీటిని ఉపయోగించుకోవాలని యూరోప్ దేశాల్లోని పారిశ్రామిక వేత్తలను కోరారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థాయి దేశంగా మారుతుందని, అందులో ఏపీ ముందుంటుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+