Game Changer: టీవీల్లో గేమ్ ఛేంజర్ మూవీ -విశాఖలో సైబర్ క్రైమ్ అరెస్టులు..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్ బాక్సాఫీసు వద్ద నిరూపించుకునే లోపే పైరసీ భూతం చుట్టుముట్టింది. సంక్రాంతికి సినిమా బెనిఫిట్ షో పడగానే పైరసీ కాపీలు ఆన్ లైన్లో ప్రత్యక్ష మయ్యాయి. వైజాగ్ లో అయితే ఏకంగా లోకల్ టీవీ ఛానల్లోనే గేమ్ ఛేంజర్ సినిమా ప్రసారమైంది. దీంతో గేమ్ ఛేందర్ నిర్మాతలు షాకయ్యారు. ఓవైపు సినిమాకు మిక్సెడ్ టాక్ రావడం, మరోవైపు ఇలా కేబుల్ ఛానళ్లలో పైరసీ కాపీ ప్రసారం చేస్తుండటంతో అప్రమత్తమ్యయారు.

సైబర్ క్రైమ్ పోలీసులకు గేమ్ ఛేంజర్ నిర్మాతలు ఫిర్యాదులు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇవాళ ఉదయం వైజాగ్ లోని ఏపీ లోకల్ టీవీ ఛానల్ నిర్వాహకుల్ని అరెస్టు చేసారు. చిత్రం పైరసీ కాపీని ఎక్కడ సంపాదించారన్న వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఛానల్ ఎక్విప్మెంట్ ను సైతం సీజ్ చేసారు. పైరసీ చట్టం కింద కేసు నమోదు చేసి విచారించేందుకు సిద్దమవుతున్నారు.

vizag cyber crime police arrest ramcharan s game changer movie piracy copy telecasters

కాపీరైట్ సేఫ్టీ సిస్టమ్స్.మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.వి.చలపతి రాజు, బృందంతో పాటు గాజువాక పోలీస్ ,క్రైమ్ క్లూస్ టీమ్, విశాఖపట్నం కమిషనరేట్ అప్పల రాజు అనే వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ లోకల్ టీవీపై దాడులు నిర్వహించినట్లు తెలిపారు.రామ్ చరణ్ తెలుగు మూవీ గేమ్ ఛేంజర్ పైరసీ చేస్తున్న అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు పైరసీకి వాడిన అన్ని పరికరాలను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+