• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీలో గంటాకు దక్కిన హామీ ఏంటి- మాజీ మంత్రి అవంతి రూటు ఎటు..!!

|
Google Oneindia TeluguNews

వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే గంటా ఎంట్రీ ఖాయమైంది. వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్- టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరోక్షంగా గంటా రాకను నిర్ధారించారు. వైసీపీ ముఖ్య నేతలతో గంటా చర్చల తరువాతనే తుది నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో మాజీ మంత్రి అవంతి ఆలోచనలు ఏంటనే చర్చ మొదలైంది. మంత్రిగా ఉన్న సమయంలో గంటా వైసీపీలోకి రావటాన్ని అవంతి శ్రీనివాస్ వ్యతిరేకించారు. గంటా పైన ఫైర్ అయ్యారు. ఇప్పుడు వైసీపీలోకి గంటా చేరిక లాంఛనమే. అవంతి వైసీపీలోనే ఉంటారా. వేరే ఆలోచన చేస్తారా. వైసీపీ ముఖ్యులు ఈ ఇద్దరి విషయంలో చెబుతుంది ఏంటి.

 వైసీపీ నుంచి గంటా కు దక్కిన హామీ ..

వైసీపీ నుంచి గంటా కు దక్కిన హామీ ..

గంటా చాలా రోజులుగా వైసీపీ ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నారు. వైసీపీలోకి ఎంట్రీకి ముందే తనకు పార్టీలో లైన్ క్లియర్ చేసుకున్నారు. సమీప రాజకీయాల్లో చోటు చేసుకొనే పరిణామాల పైన చర్చలు చేసారు. ఇప్పుడు తన సన్నిహితులకు అవే విషయాలను షేర్ చేసారు. విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధానితో వైసీపీ అడుగులు వేస్తున్న వేళ.. వైజాగ్ సిటీ కేంద్రంగా గంటా నిర్ణయం టీడీపీకి ప్రతికూలంగా మారనుంది. గంటా శ్రీనివాస రావు వైసీపీలో చేరితే ఆయనకు భీమిలి సీటు పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి గంటాతో పాటుగా మరో ముగ్గురు విశాఖ కీలక నేతలను వైసీపీలోకి తీసుకొచ్చే విధంగా నిర్ణయం జరిగి నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం భీమిలి నుంచి మాజీ మంత్రి అవంతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంటా శ్రీనివాస రావు 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి భీమిలి నియోజవకర్గం నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో భీమిలి స్థానం దివంగత సబ్బం హరికి టీడీపీ కేటాయించింది. గంటా విశాఖ నార్త్ నుంచి గెలుపొందారు. అవంతి శ్రీనివాసరావు వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచి..మంత్రి పదవి దక్కించుకున్నారు.

గంటా ఎంట్రీతో అవంతి నిర్ణయం ఏంటి..

గంటా ఎంట్రీతో అవంతి నిర్ణయం ఏంటి..


గంటా శ్రీనివాస రావు - అవంతి శ్రీనివాస్ ఇద్దరూ ప్రజారాజ్యంలో కలిసి పని చేసారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం తరువాత గంటా నాటి సీఎం కిరణ్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికల సమయంలో ఇద్దరూ కలిసి మరి కొంత మంది నేతలతో పాటుగా టీడీపీలో చేరారు. ఆ సమయంలోనే అవంతి తిరిగి తాను భీమిలి నుంచి పోటీకి సిద్దపడగా.. అనూహ్యంగా అవంతి తరపున గంటా టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరిపి అనకాపల్లి ఎంపీగా అవంతిని పోటీకి దింపారు. ఇక, చంద్రబాబు కేబినెట్ లో గంటా మంత్రి కాగా.. అవంతి ఎంపీగా ఢిల్లీకి వెళ్లారు. ఆ తరువాత క్రమేణా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఇక, 2019 ఎన్నికల సమయంలో తిరిగి భీమిలి సీటు హామీతోనే అవంతి శ్రీనివాస్ టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఆ సీటు నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు. గంటా వైసీపీలోకి రావటం పైన తొలి నుంచి అవంతి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అవంతి స్థానంలో పంచకర్ల రమేష్ బాబు నియమితులయ్యారు. ఆయన గంటాకు సన్నిహితులు. గంటా రాక ఖాయమైన సమయంలో అవంతి నిర్ణయం కీలకం కానుంది.

సీనియర్ మంత్రి రాజీ ఫార్ములా..

సీనియర్ మంత్రి రాజీ ఫార్ములా..


గంటాను వైసీపీకి తీసుకొచ్చే క్రమంలో సీనియర్ మంత్రి కీలక పాత్ర పోషించారు. గతంలో గంటాతో కలిసి మంత్రివర్గ సహచరుడిగా ఆయన పని చేసారు. ఇప్పుడు గంటా రాకను వ్యతిరేకిస్తున్న అవంతి తోనూ చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అవంతికి నష్టం లేకుండా.. గంటాకు ఆయనతో వచ్చే నేతలకు పార్టీలో సర్దుబాటు ఉంటుందని హమీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఎన్నికలు కీలకం కావటం ..అందునా విశాఖ నగరంలో వైసీపీకి గెలుపు ప్రతిష్టాత్మకం కావటంతో పార్టీలో చేరికలు తప్పవని చర్చించినట్లు తెలుస్తోంది. అందునా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కావటంతో సైకలాజికల్ గా టీడీపీ పైన పైచేయి సాధించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. విశాఖ జిల్లాకు చెందిన మరో టీడీపీ సీనియర్ నేత కూడా వైసీపీతో టచ్ లోకి వచ్చినట్లు చెబుతున్నారు. అటు చిరంజీవితో ఉన్న సత్సంబంధాల కారణంగా.. మెగాస్టార్ తో చర్చల తరువాత గంటా అధికారికంగా తన నిర్ణయం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

English summary
TDP MLA Ganta Srinivasa Rao likely to join in YSRCP in few days, its a big shcok for TDP in Vizag city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X