• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విశాఖపై అష్టావక్రుడి కన్ను.. పేలుళ్లు అందుకేనన్న అనిత.. కుట్రకోణంపై లోకేశ్ భగ్గు.. సాయిరెడ్డి ట్వీట్

|

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం పేరును ప్రతిపాదించిన తర్వాత ఆ సిటీలో, దాని శివారు ప్రాంతాల్లో వరుసగా ప్రమాద ఘటనలు జరుగుతుండటం చర్చనీయాంశమైంది. సోమవారం రాత్రి పరవాడలోని విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీలో భారీ పేలుళ్లతో మంటలు ఆకాశానికి ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. విశాఖలో వరుస ప్రమాదాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనాలని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే, కుట్రకోణమంటూ వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. సిటీ ఘనతను వివరిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

వైసీపీ నుంచి ప్రాణహాని.. అమిత్ శాఖ అధికారులతో రెబల్ ఎంపీ రఘురామ భేటీ..

ఈ నగరానికి ఏమైంది?

ఈ నగరానికి ఏమైంది?

ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను విశాఖలో ఏర్పాటు చేయాలనుకుంటోన్న జగన్ సర్కారు.. నేడో రేపో తరలింపు ప్రక్రియ చేపట్టబోతోందనీ వార్తలు వస్తుండగానే, పరవాడ ప్రమాదంతో సిటీపై చర్చ తారాస్థాయికి చేరింది. గతంలో హుద్ హుద్ తుఫాను, ఈ మధ్యే ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన, దాని తర్వాత అలాంటివే ఒకటిరెండు చిన్న సంఘటనలు, ఇప్పుడు పరవాడలోని రాంకీ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం.. ఇలా వరుస ప్రమాదాలతో ఈ నగరానికి ఏమైంది తరహా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటోన్న ప్రతిపక్ష పార్టీలు సహజంగానే ఈ అంశంపై ఘాటుగా స్పందిస్తున్నాయి.

విశాఖపై అష్టావక్ర కన్ను..

విశాఖపై అష్టావక్ర కన్ను..

విశాఖలో వరుస పారిశ్రామిక ప్రమాదాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనాలని మాజీమంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణ అన్నారు. జగన్ కు విశాఖపై ప్రేమంటే ఇదేనా అని ప్రశ్నించారు. విశాఖ సాల్వెంట్స్ ప్లాంటులో ప్రమాదానికి కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖను రాజధానిగా ప్రతిపాదించినప్పటి నుంచి వైసీపీ నేతల కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయని, విజయసాయి రెడ్డి లాంటి కీలక నేతలు భూదందాలకు పాల్పడుతున్నారని టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే, టీడీపీకే చెందిన మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తాజా అగ్నప్రమాదంపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. విశాఖపై అష్టావక్రుడి దృష్టిపడిందన్నారు.

జగన్ పై డిప్యూటీ సీఎంకే నమ్మకం లేదు.. బాషాకు హైదరాబాద్‌లో ట్రీట్మెంట్.. టక్కుఠమారాలన్న సాయిరెడ్డి..

ఆ చూపు నుంచి తేరుకోలేం..

ఆ చూపు నుంచి తేరుకోలేం..

‘‘ప్రశాంతంగా ఉండే మా విశాఖ మీద ఏ అష్టావక్రుడి కన్ను ఏ ముహూర్తన పడిందో తెలీదు కానీ భూకబ్జాలు, లాండ్ సెటిల్మెంట్స్, హత్యలు, గాస్ లీకులు,పేలుళ్లతో అతలాకుతలం అవుతోంది. హుదుద్ ప్రభావం నుంచి వారంరోజుల్లోనే తెరుకున్నాం కానీ, ఈ చూపు నుంచి ఇప్పుడప్పుడే తెరుకోలేకున్నాం'' అని అనిత వ్యాఖ్యానించారు. ప్రమాదం ఒక చోట జరిగితే.. వైసీపీ ఎమ్మెల్యే అనుదీప్ రాజ్ మరో చోట ప్రెస్ మీట్ పెట్టి స్థానికులకు ధైర్యం చెబుతున్నారని టీడీపీ ఎద్దేవా చేసింది.

ప్రమాదం వెనుక టీడీపీ కుట్ర?

ప్రమాదం వెనుక టీడీపీ కుట్ర?

విశాఖలో వరుస ప్రమాదాల వెనుక టీడీపీ కుట్ర ఉందా? అంటూ ఓ ప్రముఖ టీవీ చానెల్ లో వార్తలు వచ్చాయని వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆరోపించగా, అలాంటి వార్తలే వైసీపీ అనుకూల మీడియాలో వచ్చాయని అనిత కౌంటర్ ఇచ్చారు. ‘‘వైసీపీ అనుకూల టీవీల్లోనూ వార్తలు వచ్చాయి. అంటే ప్రమాదంలో అధికార పార్టీ హస్తం ఉందా? ఇంకా ఎన్నిరోజులు ఇలా టీడీపీ మీద దొగఏడుపులు?''అని ప్రశ్నించారామె. ఈలోపే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరో సంచలన అంశాన్ని తెరపైకి తెచ్చారు..

ఏం పీకారో జగన్‌నే అడగండి..

ఏం పీకారో జగన్‌నే అడగండి..

వైజాగ్ పేలుడు ఘటనతో టీడీపీకి లింకులు పెడుతూ వైసీపీ సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం జరిగింది. వైజాగ్ సేఫ్ కాదంటూ గతంలో చంద్రబాబు అన్నారని, రాజధాని వైజాగ్ కు వెళ్లడం ఇష్టంలేకే ఆయన కుట్రలు పన్నుతున్నారనే కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ తరహా దుర్మార్గపు రాతలు, అనుచిత ఆరోపణలు కరెక్ట్ కాదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. వైసీపీ సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించారు. ‘‘జగన్ పేటిఎం బ్యాచ్ ఐదు రూపాయిల ముష్టి కోసం నికృష్టపు పనులు చేస్తూ బరితెగిస్తున్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఫేక్ ట్వీట్లతో ఆవేశపడుతున్నారు. ఈ ఫేక్ బతుకులకు స్వస్తి పలికి, వారు మొదలుపెట్టిన మూడు ముక్కలాట తో సాధించింది ఏంటి? మూడు ప్రాంతాల్లో ఎం అభివృద్ధి చేసావ్? ఏడాదిగా ఏం పీకావని ''యుశ్రారైకాపా'' అధినేత జగన్ రెడ్డి ని నిలదీస్తే మంచిది''అని మండిపడ్డారు.

గూగుల్‌తో వైజాగ్ ఘనత..

గూగుల్‌తో వైజాగ్ ఘనత..

వరుస ప్రమాదాల తర్వాత వైజాగ్ ఇమేజ్ పై చర్చ జరుగుతోన్న సమయంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విభిన్న అంశాలన్ను ప్రస్తావిస్తూ ఆసక్తికర ట్వీట్లు చేశారు. ‘‘గూగుల్ ఫర్ ఇండియా 2020 ఇనిషియేటివ్ లో వైజాగ్ మున్సిపల్ స్కూళ్లు ప్రశంసలు అందుకోవడం గొప్ప విషయం. ‘నాడు-నేడు' కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖల్ని మార్చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారు. ఏపీలో విద్యా విధానంలో మార్పులకు గూగుల్ ఇండియా సహకారం మరువలేనిది. నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికీ హక్కుగా అందించాలని, ఏపీ అంతటా ఇలాంటి స్కూళ్లే ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సుందర్ పిచాయ్ గారూ మీ సహకారానికి ధన్యవాదాలు'' అని సాయిరెడ్డి పేర్కొన్నారు. వైజగ్ లోని మున్సిపల్ స్కూళ్లు.. గూగుల్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ పొందుతోన్న సంగతి తెలిసిందే.

English summary
After Fire breaks out at Visakhapatnam pharma city, opposition tdp leaders including anitha nailed ruling ysrcp and cm jagan. ysrcp mp vijayasai reddy praised vizag by saying that Vizag Municipal School winning accolades in Google For India 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more