విశాఖ వాసులకు వీఎంఆర్డీఏ నాగుల చవితి ఆఫర్..!
ఏపీలోని విశాఖపట్నం వాసులకు నగరాభివృద్ధి సంస్థ వీఎంఆర్డీఏ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతీ ఏటా నాగుల చవితి సందర్భంగా పుట్టల్లో పాలు పోసేందుకు నగర వాసులు స్థానికంగా ఉన్న పార్కులకు వెళ్తుంటారు. అక్కడ పండుగ రోజు కూడా ఫీజు వసూలు చేసి అనుమతి ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతుంటాయి. ఈ నేపథ్యంలో వీఎంఆర్డీఏ ఈసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
నాగుల చవితి సందర్భంగా విశాఖ నగర వాసుల సౌకర్యార్ధం శనివారం అంటే 25వ తేదీ వీఎంఆర్డీఏ కు చెందిన అన్ని పార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు వీఎంఆర్డీఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు నాగుల చవితిని పురస్కరించుకొని పుట్టల్లో పాలు పోసేందుకు కుటుంబసభ్యులతో వీఎంఆర్డీఏకు చెందిన అన్ని పార్క్ లకు పెద్ద సంఖ్యలో నగర వాసులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపారు.

బీచ్ రోడ్ లోని వీఎంఆర్డీఏ పార్క్, సెంట్రల్ పార్క్, కైలాసగిరి, తెన్నేటి పార్క్ లకు వచ్చే వారికి ప్రవేశ రుసుము ఉండదని, ఈ అవకాశం నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రణవ్ గోపాల్ కోరారు. అదేవిధంగా అందరికీ నాగుల చవితి సందర్భంగా వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ శుభాకాంక్షలు తెలిపారు. వీఎంఆర్డీఏ నిర్ణయంపై నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పండుగ సందర్భంగా వీఎంఆర్డీఏ ఇలా ఉచిత ప్రవేశం కల్పించడం మంచి నిర్ణయమని ప్రశంసిస్తున్నారు.












Click it and Unblock the Notifications