యూట్యూబర్ కావాలనుకుంటున్నారా? బాగా వ్యూస్ వచ్చే కొన్ని ఐడియాలివే!!
చాలా మంది యూట్యూబ్ లో వీడియోలు చేసి, తమలో ఉన్న టాలెంట్ ను ప్రపంచానికి తెలియ చేయాలని, తద్వారా డబ్బులు సంపాదించాలని భావిస్తూ ఉంటారు. ఇక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలి అనుకున్న వారికి ఎలాంటి వీడియోలు చేయాలో తెలియక తికమక పడుతుంటారు. అటువంటి వారు ఏ ఏ కేటగిరీలలో ఎలాంటి వీడియోలు చేయొచ్చు అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
వీడియోలు పోస్ట్ చేసి యూట్యూబర్ కావాలని కోరుకునే వారు టెక్, అన్ బాక్సింగ్ ఐటమ్స్ కు సంబంధించిన వీడియోలు చేస్తే వీటికి మంచి వ్యూస్ లభిస్తాయి. రకరకాల మొబైల్స్, ఎలక్ట్రిక్ డివైస్ లు మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. వాటిని అందరికంటే ముందుగా అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించవచ్చు. గాడ్జెట్ లపై రివ్యూలు కూడా ఇవ్వొచ్చు.

అంతేకాదునిజ జీవితంలోని అనేక విషయాలపై సినిమా, వర్తమాన అంశాలు, రాజకీయాలు ఇలా వివిధ రంగాలకు చెందిన అంశాలపై, మహిళలకు సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్, వంటలు, భక్తి సమాచారం ఇలా ఏ సబ్జెక్టు పై గొప్ప గ్రిప్ ఉంటుందో ఆ సబ్జెక్టుకు సంబంధించిన వీడియోలు చెయ్యొచ్చు. మీకు తెలిసిన సబ్జెక్ట్ ను ఒక కోర్సుగా రూపొందించి యూట్యూబ్ ఛానల్ లో ఆన్లైన్ క్లాసులు కూడా చెప్పొచ్చు.
రోజువారీ జీవితంలో, ఇంట్లో తరచూ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు చక్కని పరిష్కారం చూపిస్తూ డు ఇట్ యువర్ సెల్ఫ్ వీడియోలను కూడా చేయొచ్చు. ట్రావెల్ వీడియోలు, వివిధ రెస్టారెంట్లలో ప్రత్యేకమైన ఫుడ్ కు సంబంధించిన వీడియోలు చేయొచ్చు. ఈ మధ్య ఇటువంటి చానల్స్ బాగా ప్రత్యేకమైన ఆదరణ పొందుతున్నాయి.
అంతేకాదు డాన్స్, సంగీతం, పెయింటింగ్ ఇలా అనేక కళలు నేర్పించడానికి ట్యుటోరియల్స్ ఛానల్ కూడా పెట్టుకోవచ్చు. స్పూర్తిదాయకమైన మోటివేషనల్ వీడియో లను కూడా చెయ్యొచ్చు. వీడియోలు చూసే వారిలో స్ఫూర్తిని నింపొచ్చు. ఇతరులను ఆటపట్టిస్తూ చేసే ప్రాంక్ వీడియోలు, స్పూఫ్స్ చేసి పెట్టొచ్చు. అయితే ఏదైనా సరదాగా ఉండేలా చూసుకోవాలి.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications