రేపు తేలిపోనున్న తిరుపతి గోవుల వ్యవహారం.. 10 గంటలకు పల్లా వర్సెస్ భూమన ..!

తిరుపతిలోని టీటీడీ గోశాలలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత మూడు నెలల్లో 100 ఆవులు చనిపోయినట్లు వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఇంత భారీ సంఖ్యలో ఆవులు చనిపోతుంటే టీటీడీ ఏం చేస్తుందన్న చర్చ మొదలైంది. మొదట్లో దీన్ని ఫేక్ అంటూ ఖండించిన టీటీడీ చివరకు 43 గోవులు చనిపోయినట్లు అంగీకరించింది. అయినా టీడీపీ మాత్రం గోవులపై వైసీపీ ఫేక్ ప్రచారం అంటూ ఎదురుదాడి చేస్తోంది.

ఈ నేపథ్యంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం గోవుల మృతిపై విచారణ చేయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వస్తే గోవుల మృతిపై వాస్తవాలు తేలుస్తామంటూ భూమనకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. ఆ తర్వాత కౌంట్‌డౌన్ ప్రారంభం. వైఎస్ జగన్‌కి, భూమన కరుణాకర్‌రెడ్డికి ఇదే మా ఛాలెంజ్. ఏప్రిల్ 17వ తేదీన తిరుమలకు రండి. గోశాలలో గోమాతలు ఎలా ఉన్నాయో మీ కళ్లారా చూడండి అంటూ టీడీపీ ట్వీట్ కూడా చేసింది.

war of words between ysrcp and tdp over ttd goshala cows deaths bhumana accepts palla s challenge

దీనికి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. టీడీపీ ఛాలెంజ్ ను అంగీకరిస్తున్నట్లు పేర్కొంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు టీడీపీ రాష్ట్ర పల్లా శ్రీనివాసరావును ఉద్దేశించి సెటైర్లు వేశారు. గోవులు చనిపోయింది తిరుమలలో కాదు తిరుపతిలో అంటూ పేర్కొన్నారు. అజ్ఞానం ఎవరిదో తెలుసుకోవాలంటూ చురకల అంటించారు. అలాగే అక్కడ గోవుల్ని చూస్తే చనిపోయిన గోవులు రావంటూ తెలిపారు. తాను చెప్పింది చనిపోయిన గోవుల గురించి అన్నారు. చనిపోయిన గోవులపై విచారణ చేయిస్తే తెలుస్తుందన్నారు. అలాగే ఈవో శ్యామలరావు చెప్పిన 43 గోవుల మృతిని పల్లాకు భూమన గుర్తుచేశారు. చివరికి తాను రేపు 10 గంటలకు వస్తున్నా అని ప్రకటించారు.

పల్లా శ్రీనివాసరావు సవాల్ లో చెప్పినట్లుగా తిరుపతి గోశాలకు వచ్చేందుకు భూమన కరుణాకర్ రెడ్డి అంగీకరించిన నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు ఏం జరగబోతోందన్న టెన్షన్ నెలకొంది. అసలు వీరిద్దరినీ పోలీసులు గోశాలకు వచ్చేందుకు అంగీకరిస్తారో లేదో తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+