వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

' వాస్తవాలు టిడిపి నేతలు తట్టుకోవడం లేదు,వారికి ఎందుకు మంత్రిపదవులిచ్చారు'

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి : వాస్తవాలు చెబితే తట్టుకోలేని వారు మాత్రం గురించి నా ఇంటిని ముట్టడించాలని ప్రయత్నించారని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు.క్షేత్రస్థాయిలో ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న వాటిని మాత్రమే తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నానని సోము వీర్రాజు చెప్పారు.

అవినీతికి వారసులు, రాష్ట్రంలో రూలింగ్ లేదు: బాబుపై సోము వీర్రాజు ఫైర్అవినీతికి వారసులు, రాష్ట్రంలో రూలింగ్ లేదు: బాబుపై సోము వీర్రాజు ఫైర్

టిడిపి నేతలపై, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శలపై టిడిపి నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

''బిజెపికి వ్యతిరేకంగా బాబు చక్రం: టిడిపి ప్లానేంటీ, మిత్రధర్మం ఇదేనా?''''బిజెపికి వ్యతిరేకంగా బాబు చక్రం: టిడిపి ప్లానేంటీ, మిత్రధర్మం ఇదేనా?''

టిడిపి నేతల తీరుపై బిజెపి ఎమ్మెల్సీపై సోము వీర్రాజు మరోసారి ధ్వజమెత్తారు. ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి టిడిపి నేతల తీరును తప్పుబట్టారు.

'బిజెపికి గుడ్‌బై చెప్పండి, కలిసే పోరాటం' 'బాబుపై కేసులతోనే రాష్ట్రానికి నష్టం''బిజెపికి గుడ్‌బై చెప్పండి, కలిసే పోరాటం' 'బాబుపై కేసులతోనే రాష్ట్రానికి నష్టం'

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అద్భుతంగా ఉందని స్వామినాథన్ లాంటి వారు ప్రశంసిస్తోంటే టిడిపి నేతలకు ఎందుకు కన్పించడం లేదని ఆయన ప్రశ్నించారు.కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధుల గురించి తాను చెబుతున్నానని సోము వీర్రాజు చెప్పారు.

 వైసీపీ ఎమ్మెల్యేలకు ఎందుకు మంత్రి పదవులిచ్చారు

వైసీపీ ఎమ్మెల్యేలకు ఎందుకు మంత్రి పదవులిచ్చారు

వైసీపీ పార్టీ అవినీతీ పార్టీ అంటూ టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు గుర్తు చేశారు. అయితే వైసీపీ నుండి ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన వారికి ఎందకు మంత్రి పదవులు కేటాయించారో చెప్పాలని సోము వీర్రాజు ప్రశ్నించారు.తాను జగన్‌కు ఏజంట్ అంటూ చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. జగన్‌తో నాకు సంబంధాలు లేవని ఆయన ప్రశ్నించారు

 నాకు స్వంత ఎజెండా లేదు

నాకు స్వంత ఎజెండా లేదు

నాకు స్వంత ఎజెండాలు లేవని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను మాత్రమే తాను ప్రజల దృష్టికి తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నట్టు సోము వీర్రాజు చెప్పారు. బిజెపి కార్యకర్తల అభిప్రాయాలను మాత్రమే తాను ప్రతిబింబించేలా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

ట్రేడర్‌ను ప్రోత్సహించవద్చా

ట్రేడర్‌ను ప్రోత్సహించవద్చా

మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ప్రయోజనమయ్యేలా అనేక కార్యక్రమాలను తీసుకొన్నట్టు చెప్పారు, నిత్యావసర సరుకుల ధరలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మోడీ ప్రయత్నించారని చెప్పారు. కానీ, ఏపీ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని వీర్రాజు చెప్పారు. ట్రేడర్ ను ప్రోత్సహించేలా పాలన ఉందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.

 నా ఇంటి ముట్టడి వెనుక ఎవరున్నారో తెలుసు

నా ఇంటి ముట్టడి వెనుక ఎవరున్నారో తెలుసు

టిడిపిపై తీవ్ర విమర్శలు చేసిన బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇంటిని ముట్టడిస్తామని టిడిపి నేతలు ప్రకటించారు. అయితే దీని వెనుక ఎవరున్నారో తనకు తెలుసునని సోము వీర్రాజు చెప్పారు. ఏపీ పునర్విభజన బిల్లులో ఉన్న అంశాలు బడ్జెట్ లో ఉండవన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన నిధుల గురించి తాను చెబుతున్నట్టు చెప్పారు.

English summary
Bjp MLC Somu verraju made allegations on tdp leaders on Monday. A Telugu channel interviewed him on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X