కర్నూలు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్- బైక్ ను ఢీకొట్టని బస్సు ? మద్యం మత్తులో..!
నిన్న తెల్లవారు జామున ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకూ తప్పించుకున్నా గాయాల పాలయ్యారు. ఈ ఘటన జాతీయ స్ధాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వేర్వేరుగా ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నాయి. ఇందులో ఏపీ పోలీసుల దర్యాప్తులో తాజాగా పలు సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి.
ఇందులో కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు కారణమని భావిస్తున్న బైక్ ను నడిపిన శివశంకర్ కొద్దిసేపటి ముందు బంకులో
పెట్రోల్ కొట్టించుకుంటున్న సీసీటీవీ దృశ్యాలు బయటికి వచ్చాయి. ఇందులో శివశంకర్ తో పాటు అతని స్నేహితుడు ఎర్రిస్వామి కూడా బైక్ పై ఉన్నాడు. ఇప్పటివరకూ బైక్ లో శివశంకర్ వెళ్తుండగా.. వేగంగా వచ్చిన కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొని ఘోర ప్రమాదం జరిగిందని భావిస్తుండగా.. అది నిజం కాదని తాజా దర్యాప్తులో తేలింది.

Young man became the reason for Kurnool bus accident, was riding a bike in the state of intoxication?#KurnoolAccident #DrunkDriving #RoadSafety #TrafficIncident #IndiaNews #Oneindia pic.twitter.com/qX1aniYWAa
— Oneindia News (@Oneindia) October 25, 2025
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులకు కీలక ఆధారాలు లభిస్తున్నాయి. బైక్‌పై శంకర్‌తో పాటు ఉన్న మరో యువకుడు ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో బైక్‌ను వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టలేదని వెల్లడైంది. వర్షంలో బైక్‌పై వెళుతున్న శంకర్, ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. చిన్నటేకూరు దగ్గర బైక్ స్కిడ్ అయ్యి యువకులు కిందపడ్డట్లు తేలింది.

రోడ్డు మధ్యలో బైక్ పడిపోవడంతో రోడ్డుకు ఇరువైపులాా శంకర్, ఎర్రిస్వామి పడిపోయారని తేలింది. డివైడర్‌ను ఢీకొట్టడంతో శంకర్ తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో స్పాట్‌లో శంకర్ మృతి చెందాడు. అయితే ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత వేగంగా బైక్‌పై నుంచి వీ కావేరి ట్రావెల్స్ బస్సు వేగంగా దూసుకెళ్లింది. సుమారు 300 మీటర్ల వరకూ బైక్‌ను ఈడ్చుకెళ్లిన బస్సు. ఆ తర్వాత మంటలు అంటుకోవడంతో కాలి బూడిదైంది. బస్సు ప్రమాదంతో ఎర్రిస్వామి భయపడి పారిపోయాడు. సీసీ ఫుటేజ్, సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా ఎర్రిస్వామిని పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications