వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి ప్రజలు శిక్షవేశారు: గుత్తా సుఖేందర్, ఆనందం లేదని..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు బాధాకరంగా ఉందని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీలతోపాటు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల తీర్పును శిరసావహిస్తామని చెప్పారు. తెలంగాణ కోసం 12మంది కాంగ్రెస్ ఎంపీలమూ పోరాటం చేశామని చెప్పారు. అయినా తెలంగాణ ప్రజలు శిక్ష తమకు శిక్ష ఎందుకు వేశారో అర్థం కావడం లేదని అన్నారు.

ప్రజల తీర్పు తెలంగాణ కోసం పోరాటం చేసినందుకా? లేక తెలంగాణ సాధించినందుకా అని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ ప్రజాప్రతినిధులను ఓటమిపాల్జేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గెలించినందుకు కూడా ఆనందం లేకుండా పోయిందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నో కష్టాలకోర్చి తెలంగాణ ఇచ్చిందనీ.. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయిందని అన్నారు.

We are accept people decision: Gutta Sukhender Reddy

తెలంగాణ సిపిఐ కార్యదర్శిగా చాడ వెంకట్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శిగా చాడ వెంకట్ రెడ్డి శుక్రవారం ఎన్నికయ్యారు. ఉప కార్యదర్శులుగా సిద్ధి వెంకటేశ్వర్లు, పల్లా వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరెడ్డి మాట్లాడారు. రెండు రాష్ట్రాలకు (సీమాంధ్ర, తెలంగాణ) వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తమ వాదనను వినిపించే వీలులేకుండా పోయిందని సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులను ఉద్దేశించి అన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి ఎన్నికపై తర్జనభర్చనలు జరుగుతున్నాయి. రైతు సంఘం నేత రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావుల మధ్య పోటీ నెలకొంది.

English summary
Congress MP Gutta Sukhender Reddy on Friday said that they will accept Telangana peoples decision in elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X