'అవసరమైతే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి మోడీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం'
అమరావతి: భారతీయ జనతా పార్టీతో జత కట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దొంగ పాదయాత్రలు చేస్తున్నారని ఎంపీ కొనకళ్ల నారాయణ గురువారం మండిపడ్డారు. తమకు వైసీపీ అసలు ప్రత్యర్థే కాదని వ్యాఖ్యానించారు.
మచిలీపట్నం పోర్టును వ్యతిరేకిస్తున్న జగన్‌కు కృష్ణా జిల్లాలో పర్యటించే హక్కు, అర్హత లేదన్నారు. కేంద్రం విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం దిగి వచ్చే వరకు తమ పోరాటం ఆగదన్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసైనా నరేంద్ర మోడీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామన్నారు.

నగదు కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నగదు కొరత కారణంగా రియల్ ఎస్టేట్ బాగా పడిపోయిందని చెప్పారు. వృద్ధి రేటు 2 శాతం తగ్గిందని, నిర్మాణాలు తగ్గిపోయాయని చెప్పారు. మనీ సర్క్యులేషన్ లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు అన్నారు.
బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీలోకి తమ పార్టీ వారిని తీసుకోవద్దని జగన్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కోరారని ఆరోపించారు. బీజేబపీ, వైసీపీలు కలిసి చంద్రబాబును దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాయన్నారు.
అమిత్ షా ఇష్టానుసారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని వర్ల ఎద్దేవా చేశారు. జగన్ ప్రధాని మోడీని ప్రశ్నించలేడని, కేసుల కోసమే ఆయన మౌనంగా ఉంటున్నారని, ఒకవేళ మోడీని ప్రశ్నిస్తే ఆ మరుక్షణం ఆయన జైల్లో ఉంటారని వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని వర్ల గుర్తు చేశారు. ఆయన వైసీపీలోకి వెళ్లకుండా ఆపిందెవరని ప్రశ్నించారు. బీజేపీ - వైసీపీ మధ్య ప్రశాంత్ కిషోర్ అనుసంధాన కర్తగా ఉన్నారని చెప్పారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications