పవన్ కల్యాణ్‌తో జత కట్టలేదు, ఆయనే మద్దతిచ్చారు: సిద్దార్థనాథ్ సంచలనం
ఏలూరు: పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీపై బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ సిద్దార్థనాథ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. తాము జనసేనతో ఎప్పుడు కూడా జత కట్టలేదని, ఆ పార్టీయే తమకు ఎన్నికల్లో మద్దతు ఇచ్చిందని ఆయన బుధవారంనాడు చెప్పారు.
తెలుగుదేశం పార్టీతో తమకు ఏ విధమైన విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ఈ నెల 6వ తేదీన విజయవాడలో తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ నిర్వహిస్తారని ఆయన చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన ర్యాలీ నిర్వహించారు.

గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తెలుగుదేశం, బిజెపి కూటమికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆయన ప్రత్యేక హోదా కోసం బిజెపిపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థనాథ్ సింగ్ ఆ ప్రకటన చేసినట్లు అర్థమవుతోంది.
కాగా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో తెగదెంపులు చేసుకోవడానికి కూడా బిజెపి సిద్ధంగా లేదని అర్థమవుతోంది. ఇటీవల తన పర్యటన సందర్బంగా అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ విషయాన్ని స్పష్టం చేశాయి.












Click it and Unblock the Notifications