వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇచ్చిన మాటకు కట్టుబడ్డాం.. ఇంగ్లీష్ మీడియం కోసం సుప్రీం కోర్టుకు వెళ్తాం : ఏపీ విద్యాశాఖామంత్రి

|
Google Oneindia TeluguNews

ఇంగ్లిష్‌ మీడియం విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడ్డామని , సీఎం జగన్ ఇచ్చిన మాట కోసం ఎక్కడి దాకైనా వెళ్తారని ఏపీ విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. హైకోర్టు ఇంగ్లిష్ మీడియం జీవోలను రద్దు చేస్తూ జడ్జిమెంట్ ఇవ్వటంతో జడ్జిమెంట్ విషయంలో ఆయన స్పందించారు . జీవోల రద్దుపై హైకోర్టు జడ్జిమెంట్‌ కాపీ చూశాక అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

కరోనా బాధితులకు 2 వేలు ఆర్ధిక సాయం .. సీఎం జగన్ నిర్ణయంకరోనా బాధితులకు 2 వేలు ఆర్ధిక సాయం .. సీఎం జగన్ నిర్ణయం

టీడీపీ నాడు ఓకే చెప్పి నేడు మాట మార్చింది

టీడీపీ నాడు ఓకే చెప్పి నేడు మాట మార్చింది

ఇక తాజాగా ఇంగ్లీష్ మీడియం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును విజయంగానో, అపజయంగానో చూడొద్దని పేర్కొన్న ఆయన ఇంగ్లీష్ మీడియం అమలు విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ నేతలు చెప్తూనే ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా బాధాకరమన్నారు. ఆంగ్ల మాధ్యమంపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు మొదట ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యతిరేకించినా, ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆయన కూడా స్వాగతించారు. ఇప్పుడు మాట మార్చారన్నారు .

బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవటం టీడీపీ నేతలకు ఇష్టం లేదు

బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవటం టీడీపీ నేతలకు ఇష్టం లేదు

హైకోర్టు అభ్యంతరం చెప్పిందని చంద్రబాబు, టీడీపీ నేతలు ఇప్పుడు హర్షం వ్యక్తం చేయడం దారుణం అని మంత్రి సురేష్ అభిప్రాయపడ్డారు. ఇక టీడీపీ నేతలకు నిరుపేదల పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవటం ఇష్టం లేదని వ్యాఖ్యానించారు . అందుకే కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు . ఇప్పటికే ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేందుకు ఇప్పటికే లక్ష మంది టీచర్లకు ట్రైనింగ్‌ ఇచ్చామని, బ్రిడ్జి కోర్సులు ప్రవేశ పెడుతున్నామని చెప్పారు . వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు .

Recommended Video

High Court Dismisses GO'S On English Medium In AP Govt Schools
సీఎం జగన్ ఇచ్చిన మాటను తప్పక నెరవేరుస్తారని హామీ

సీఎం జగన్ ఇచ్చిన మాటను తప్పక నెరవేరుస్తారని హామీ

ఆ తర్వాత ఒక్కో తరగతికి పెంచుకుంటూ పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో చదువులు చెప్పాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారని ఇక ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ అన్ని పాఠశాలల్లోని పేరెంట్స్‌ కమిటీలు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాయని పేర్కొన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్ . అంతేకాదు తెలుగు సబ్జెక్ట్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నామని తెలుగును తప్పనిసరి చేస్తూ ప్రాథమిక విద్యను అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు . సీఎం ఇచ్చిన మాటను తప్పక నెరవేరుస్తారని హామీ ఇచ్చిన మంత్రి సుప్రీం ను ఆశ్రయించి అయినా జగన్ అనుకున్నది సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

English summary
AP Education Minister Adhimulapu Suresh said that they had committed to the English medium and would go anywhere for CM Jagan's assurance. He responded to the judicial decision by the High Court overturning the English Medium . Suresh, Minister of Education, said that the High Court Judgment on the revocation of the english medium will be sent to the Supreme Court if necessary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X