కాంగ్రెస్‌కు షాక్: పటిష్ట నాయకత్వం కావాలన్న కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణం కోసం పటిష్టమైన నాయకత్వం అవసరమని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు అన్నారు. సోమవారం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో పొత్తు లేదా విలీనంమై వస్తున్న ప్రచారాలకు ముగింపు పలుకుతున్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలను గమనిస్తే అర్థమవుతోంది.
ఎన్నిలకు ఒంటరిగానే సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సూచించినట్లు తెలుస్తోంది. ఎన్నో త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పిన కె చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం పటిష్ట నాయకత్వంతోనే సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు. ఇంకా ఆంధ్రా పాలకులు తెలంగాణ ప్రాంతానికి అవసరమా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ పునర్నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర సమితి కట్టుబడి ఉందని కెసిఆర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు ఎక్కువ లాభం చేకూరుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
కాగా రాష్ట్ర్ర విభజన తర్వాత టిఆర్ఎస్ తొలి పొలిట్ బ్యూరో సమావేశంలో వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన శాసనసభ్యులు నగేష్, సత్యవతి రాథోడ్‌లు చంద్రశేఖర్ రావు సమక్షంలో టిఆర్ఎస్‌లో చేరారు.












Click it and Unblock the Notifications