టీ కప్పులో తుఫాను, పాత వ్యక్తులేనని సీఎం చెప్పారు: అఖిల- ఏవీ సుబ్బారెడ్డి కలిశారు!
అమరావతి: ఆళ్లగడ్డ పంచాయతీ ముగిసింది! ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఇరువురు నేతలకు క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. కలిసి పని చేసుకోవాలని మంత్రి భూమా అఖిలప్రియకు, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డికి హితవు పలికారు. శుక్రవారం వారిద్దరితో చంద్రబాబు మరోసారి భేటీ అయ్యారు.
Recommended Video

అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య చంద్రబాబు రాజీ కుదిర్చారు. గొడవలు ఉంటే కలిసి మాట్లాడుకోవాలని హితవు పలికారు. పార్టీ కోసం పని చేయాలని సూచించారు. చంద్రబాబు వారితో విడివిడిగా, కలిసి మాట్లాడారని తెలుస్తోంది. భేటీ అనంతరం వారంతా కలిసి మీడియాతో మాట్లాడారు.

ఈ గొడవ టీ కప్పులో తుఫాను
అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య విభేదాలు సమసిపోయాయని, కలిసి పని చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారని వర్ల రామయ్య చెప్పారు. ఇద్దరు కలిసి పార్టీ కోసం పని చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. వారి మధ్య గొడవ టీ కప్పులో తుఫాను వంటిది అన్నారు. అది సమసిపోయిందన్నారు.

కలిసి ముందుకు సాగుతాం
చిన్న చిన్న విభేదాలు ఉంటే చర్చించి పరిష్కరించుకోవాలని చంద్రబాబు సూచించారని అఖిలప్రియ చెప్పారు. విభేదాలు ఉంటే ఇరువురం చర్చించుకొని పరిష్కరించుకుంటామని తెలిపారు. అందరినీ కలుపుకొని వెళ్తానని చెప్పారు. జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తామని, ఐకమత్యంతో ముందుకు సాగుతామన్నారు. కొద్ది రోజులుగా కొనసాగుతున్న పరిస్థితి బాధాకరమేనని, ఇప్పుడు కలిసి సాగుతామన్నారు.

పాత వ్యక్తులేనని చంద్రబాబు చెప్పారు
ఆళ్లగడ్డ అంటే అభివృద్ధి గుర్తుకు రావాలని సీఎం తనకు సూచించారని, తనకు ఓ కూతురుగా చెప్పారని అఖిలప్రియ అన్నారు. ఓ కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉన్నట్లే పార్టీలోను ఉంటాయని, వీటిని పరిష్కరించుకుంటామని చెప్పారు. కలుపుకుపోయేది కొత్త వ్యక్తులను కాదని, పాత వ్యక్తులే అని, తన తల్లిదండ్రులతో కలిసి పని చేసిన వ్యక్తేనని చంద్రబాబు తనకు చెప్పారని అఖిల అన్నారు. అందరం కలిసి పని చేస్తామని అధినేతకు చెప్పామన్నారు.

నా వంతు కృషి చేస్తా
ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... పార్టీ కోసం పని చేయమని చంద్రబాబు సూచించారని, ఆయన చెప్పినట్లు వింటామని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం భూమా కుటుంబానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.

విడివిడిగా.. కలిపి మాట్లాడారు
కాగా, చంద్రబాబు నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఆ తర్వాత కలిసి మాట్లాడారు. ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియలతో విడిగా మాట్లాడారు. ఆ తర్వాత వారిద్దరిని ఓ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడారు. అలాగే భూమా బ్రహ్మానంద రెడ్డి, భూమా మౌనికా రెడ్డిలతోను అధినేత మాట్లాడారు. అయితే చంద్రబాబు జోక్యంతో ప్రస్తుతానికి వివాదం ముగిసినట్లుగా కనిపించినా ఏవీ సుబ్బారెడ్డి ముక్తసరిగా మాట్లాడటం, అఖిలప్రియ తీరు కూడా అలాగే ఉందని అంటున్నారు. కాగా, ఇరువురు నేతలు తమకు సంబంధించి సాక్ష్యాలు కూడా సీఎం ఎదుట పెట్టారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications