అల్పపీడనం ఎఫెక్ట్: ఏపీలో వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ ప్రాంతంలోని హిందూ మహా సముద్రంపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ ఆవర్తన ప్రభావంతో వచ్చే 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. నవంబర్ 9 నుంచి 11 వరకు వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు కదిలే అవకాశం ఉందని, దీని కారణంగా రాగల మూడు రోజులపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

 weather: next three days normal to heavy rains in andhra Pradesh districts.

ఉత్తరకోస్తాంధ్ర, యానాంలలో రాగల మూడు రోజులపాటు వాతావరణం పొడిగానే ఉండే అవకాశం ఉంది. అయితే, దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం మంగళ, బుధవారాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములత కూడిన జల్లులు కొన్ని చోట్ల కురుస్తాయని పేర్కొంది.

రాయలసీమలో మంగళవారం పొడిగా ఉండే అవకాశం ఉంది. అయితే, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పలుచోట్ల కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+