ఏపీలో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు: ఉరుములుమెరుపులతో జల్లులు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం పొరుగు ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం మీద సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపునకు వంగి ఉందని పేర్కొంది.

కోస్తాంధ్ర, యానాంలలో మూడు రోజులపాటు వర్షాలు

కోస్తాంధ్ర, యానాంలలో మూడు రోజులపాటు వర్షాలు

ఈ ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి మూడు రోజులపాటు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

దక్షిణ కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు

దక్షిణ కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు

దక్షిణ కోస్తాంధ్రలో అక్టోబర్ 16వ తేదీ వరకు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు

రాయలసీమలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు

రాయలసీమలోనూ రానున్న మూడు రోజులపాటు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, ఇప్పటికే అనంతపురంలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేశాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనేక గ్రామాలు వరద నీటిలోనే ఉండిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+