ఏపీలో మరికొద్ది రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు: ఈ ప్రాంతాల్లో
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి వర్షాలు పలకరించనున్నాయి. ఓ వైపు చలి తీవ్రంగానే ఉంటుండగా.. తాజాగా మరో కొద్దిరోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇందుకు వాయుగుండమే కారణంగా తెలుస్తోంది.
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి బుధవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ గురువారం వాయుగుండగంగా బలపడిందిన పేర్కొంది.
అనంతరం ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమరిన్ ప్రాంతంవైపు పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ కారణంగా రానున్న మూడు రోజుల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనా ఉండనుంది. డిసెంబర్ 24 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
అయితే, ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని అధికారులు చెప్పారు. ఇక ఏపీ వ్యాప్తంగా ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తుండటంతో.. రాష్ట్ర వ్యాప్తంగా దగట్టమైన పొగమంచు, చలి ప్రభావం పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. వాయుగుండం ప్రభావం ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంపైనే ఉండనుంది.












Click it and Unblock the Notifications